ఈ సూపర్‌యాచ్‌లో ఆరు అంతస్తులు, 39 అపార్ట్‌మెంట్లు ఉంటాయి. వీటిలో ప్రతి అపార్ట్మెంట్ ఖర్చు 11 మిలియన్ డాలర్లు (సుమారు 81 కోట్లు). సోమానియో లగ్జరీ అపార్టుమెంట్లు విలాసవంతమైన సౌకర్యాలను కూడా అందిస్తాయి.
ఈ అపార్టుమెంట్లు కొనడానికి ఆఫర్లు ఇస్తారు. ఇందులో లైబ్రరీ, కిచెన్, భోజన స్థలం ఉంటాయి. ప్రతి అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకమైన జిమ్ ఉంటుంది.
ఈ పడవను స్వీడిష్ డిజైన్ సంస్థ టిల్బర్గ్ డిజైన్, లండన్ కు చెందిన వించ్ డిజైన్ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. కార్ల్ లే సూఫ్ ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్నారు.
ఈ అతిపెద్ద పడవను నార్వేలో నిర్మిస్తున్నారు. త్వరలో సోమానియో నిర్మాణ పనులు పూర్తవుతాయి.
సోమానియో నిర్మాణానికి ముందు అంటే ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పొడవైన సూపర్‌యాచ్ అజామ్. ఇది 600 అడుగుల పొడవు ఉంటుంది.