మేఘాలయలో 'ఉమాంగోట్ నది' ఉంటుంది. ఇది భారతదేశంలోనే పరిశుభ్రమైన నదిగా గుర్తింపు సంపాదించింది. ఈ నది మౌలియాన్నాంగ్ గ్రామానికి సమీపంలో ఉంటుంది. ఇది ఆసియాలో పరిశుభ్రమైన గ్రామంగా చెబుతారు. దాదాపు 300 ఇళ్లు ఉంటాయి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నదిలో మురికిని వ్యాప్తి చేస్తే 5000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు.
ప్రపంచంలో తాగునీటి కొరత చాలానే ఉంటుంది. అయితే అత్యధికంగా తాగునీటి కొరత బ్రెజిల్‌లో ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా పునరుత్పాదక నీటి వనరులపై ఆధారపడుతారు. ఇది మొత్తం 8,233 క్యూబిక్ కిలోమీటర్లు.
మహారాష్ట్ర రాష్ట్ర పక్షి హరియల్ భూమిపై కాలు పెట్టదు. పొడవైన చెట్లు ఉన్న అడవులను ఇష్టపడుతాయి. ఇవి ఎక్కువగా పీపల్, మర్రి చెట్లపై తమ గూడును నిర్మించుకోవడానికి ఆసక్తి కనబరుస్తాయి. అంతేకాదు ఇవి సామాజిక జంతువులు ఎక్కువగా మందలుగా కనిపిస్తాయి.
కరెన్సీ నోట్లు కాగితంతో తయారు చేస్తారని అనుకుంటారు. కానీ నోట్లు కాగితంతో తయారు కావు. పత్తితో తయారు చేస్తారని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే కాగితం కంటే పత్తి బలంగా ఉంటుంది త్వరగా చిరిగిపోదు కూడా.
నమీబియాలో ఒక ప్రదేశం ఉంటుంది. ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రం పశ్చిమ తీర ఎడారిని కలుస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఎడారి. ఇది 50 మిలియన్ సంవత్సరాల కంటే పాతది. విశేషమేమిటంటే ఇక్కడ కనిపించే ఇసుక దిబ్బలు ప్రపంచంలోనే అతి పెద్దవి.