గ్రహాలన్నింటిలో భూమి చాలా అందమైన గ్రహంగా చెబుతారు. ఇక్కడ ప్రకృతి అందమైన దృశ్యాలు దర్శనమిస్తాయి. వీటితో పాటు ప్రమాదకర, రహస్య ప్రదేశాలు కూడా ఉన్నాయి.
లడఖ్‌లోని అయస్కాంత కొండ : లడఖ్ ప్రాంతంలో చాలా రహస్య ప్రదేశాలు ఉన్నాయి. మీరు అక్కడ కారును పార్క్ చేస్తే అది స్వయంచాలకంగా ఎత్తు వైపునకు వెళుతుంది. దీని వెనుక శాస్త్రవేత్తలు భిన్న అభిప్రాయాలు చెబుతున్నారు. కానీ దాని అసలు రహస్యం మాత్రం ఇప్పటికి తెలియలేదు.
భయానక బొమ్మల ద్వీపం: మెక్సికోలోని డాల్స్ ఐలాండ్ చాలా ప్రమాదకర ప్రదేశం. స్థానికుల అభిప్రాయం ప్రకారం.. ఇక్కడ డజన్ల కొద్దీ బొమ్మలు ఒకదానితో ఒకటి గుసగుసలాడుతాయి. అవి కళ్ళు తిప్పి, సంజ్ఞలలో మాట్లాడుకుంటాయి. ఈ ప్రదేశంలో ఒంటరిగా తిరగడానికి అనుమతి లేదు.
దానకిల్ డిప్రెషన్: ఉత్తర ఇథియోపియాలో ఉన్న ఈ ప్రదేశాన్ని భూమిపై ఉన్న నరకం అని పిలుస్తారు. ఇక్కడ అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రదేశం చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడికి వెళ్లడం చాలా ప్రమాదకరం. ఈ ప్రదేశంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి.
గిజా పిరమిడ్లు: గిజా పిరమిడ్లు నేటికీ శాస్త్రవేత్తలకు మిస్టరీగా మిగిలిపోయాయి. అద్భుతమైన కళాకృతి, భారీ నిర్మాణం ఎలా సాధ్యమైందో ఇప్పటికి అంతుపట్టడం లేదు. ఈ పిరమిడ్ లోపల చాలా రహస్యాలు దాగి ఉన్నాయని కొంతమంది అభిప్రాయం.