Hampi Wedding: ఎల్లలు దాటిన ప్రేమ.. బళ్లారి ఆటో డ్రైవర్ .. బెల్జియం అమ్మాయి.. హిందూ సంప్రదయంలో వివాహం.. విదేశాల నుంచి 50మంది అతిథులు

|

Nov 27, 2022 | 12:00 PM

ప్రేమ ఎల్లలు దాటింది. విదేశీ యువతి భారతీయ యువకుడిని హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుంది. కర్ణాటక లోని హంపి విరూపాక్షేశ్వరాలయం ఈ పెళ్ళికి వేదికగా మారింది  సాదాసీదాగా పెళ్లి చేసుకోవాలన్న యువకుడి కోరికకు సమ్మతిస్తూ.. వరుడు అనంతరాజు, కూతురు కామిల్లెలను ఆశీర్వదించేందుకు బెల్జియం నుంచి 50 మందికి పైగా కెమిల్ కుటుంబ సభ్యులు వచ్చారు.

1 / 9
మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకోవాల్సిన ఈ జంట పెళ్లిని కరోనా మహమ్మారి అడ్డుకుంది. హిందూ సంప్రదాయం ప్రకారం హంపి విరూపాక్షేశ్వరాలయంలో సాదాసీదాగా పెళ్లి చేసుకోవాలన్న యువకుడి కోరికకు సమ్మతిస్తూ వరుడు అనంతరాజు, కూతురు కామిల్లెలను ఆశీర్వదించేందుకు బెల్జియం నుంచి 50 మందికి పైగా కామిల్లె కుటుంబ సభ్యులు వచ్చారు.

2 / 9
బెల్జియంకు చెందిన యువతిని హంపిలోని ఆటో డ్రైవర్ అనంతరాజు ప్రేమించాడు. ఇటీవల హిందూ సంప్రదాయం ప్రకారం తాను ప్రేమించిన యువతి మేడలో మూడు ముళ్ళు వేశాడు. 

3 / 9
వివాహం స్వర్గంలో నిశ్చయం అవుతుందని అంటారు. దీనికి సాక్ష్యంగా నిలుస్తుంది ఈ పెళ్లి. బెల్జియం దేశానికి చెందిన యువతి..  హంపి యువకుడు అనంతరాజు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆటోడ్రైవర్‌ అనంతరాజు విదేశీ యువతి కామిల్లె వివాహాన్ని హిందూ సంప్రదాయం ప్రకారం జరిపించారు. ఇరు కుటుంబ సభ్యులంతా ఈ పెళ్లి వేడుకను తిలకించారు. వధూవరులను ఆశీర్వదించారు.

4 / 9
వధువు స్వీట్ బ్యూటీ పేరు కామిల్లె. అలాగే వరుడు ఆటో డ్రైవర్ పేరు అనంతరాజు. కామిల్లె బెల్జియం నివాసి. అనంతరాజు హంపి నివాసి. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని కుటుంబ సభ్యుల ఆమోదం పొందారు. గురువారం సాయంత్రం నిశ్చితార్థం జరగగా శుక్రవారం నాడు హంపిలోని విరూపాక్షేశ్వరుని సన్నిధిలో శుభ ముహూర్తంలో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

5 / 9
అనంతరాజు ఆటో డ్రైవర్‌.. అంతేకాదు హంపి గైడ్ (టూర్ గైడ్) విజయనగరం గత వైభవాన్ని పర్యాటకులకు చూపిస్తాడు. బెల్జియన్ అమ్మాయి కామిల్లె సోషల్ వర్కర్. భారతీయ గత వైభవాన్ని తెలుసుకునేందుకు నాలుగైదు సంవత్సరాల క్రితం జీప్ ఫిలిప్ కుటుంబ సమేతంగా హంపికి వచ్చారు. హంపిలో ఆటో డ్రైవర్ అనంతరాజు కుటుంబాన్ని జిమ్ ఫిలిప్ కలుసుకున్నాడు.

6 / 9
అనంతరాజు నిజాయితీ గల ఆటో డ్రైవర్. మంచి మెంటర్ కూడా. మరియాన్ జైమ్ ఫిలిప్ .. మూడవ మేనకోడలు కామిల్లె హంపి ప్రకృతి అందాలకు ముగ్ధురాలైంది. రోజులు గడిచేకొద్దీ..  కామిల్లె కుటుంబంతో గైడ్ అనంతరాజు పరిచయం పెరిగింది. ఈ సమయంలో కామిల్లె ప్రేమలో పడ్డాడు అనంతరాజు . ఈ మధ్య వారిద్దరూ వేర్వేరు దేశాల్లో ఉన్నప్పటికీ ప్రేమ మాత్రం తగ్గలేదు. అందుకు తగ్గట్టుగానే ఈరోజు పెళ్లి చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.

7 / 9

మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకోవాల్సిన ఈ జంటను కరోనా మహమ్మారి అడ్డుకుంది. తమ కుమార్తె వివాహం బెల్జియంలో వైభవంగా జరగాలని కెమిల్ కుటుంబీకులు భావించినా.. హిందూ సంప్రదాయం ప్రకారం హంపి శ్రీ విరూపాక్షేశ్వర ఆలయంలో పెళ్లి చేసుకోవాలనుకున్న యువకుడి కోరికకు సమ్మతించింది. బెల్జియం నుంచి 50 మందికి పైగా కామిల్లె కుటుంబానికి చెందిన వారు వచ్చారు. అల్లుడు అనంతరాజు, కూతురు కామిల్లెలను ఆశీర్వదించారు.

8 / 9
కామిల్లె కుటుంబ సభ్యులు అల్లుడు అనంతరాజు, కుమార్తె కామిల్లెలను ఆశీర్వదించారు.

9 / 9
విదేశాల నుంచి వచ్చి కామిల్లె కుటుంబ సభ్యులు హంపికి వచ్చి తమ అల్లుడు, కూతురు కోరికను తీర్చారు.  ఈ ప్రేమికుల పెళ్లికి వందలాది గ్రామస్తులు విచ్చేసి..  నూతన జంటను ఆశీర్వదించారు. కామిల్లె కుటుంబ సభ్యులు భారతీయ సంప్రదాయం ప్రకారం చీర కట్టుకుని, నుదుటికి కుంకుమ పెట్టుకుని, చేతులకు గాజులు వేసుకుని పెళ్లి వేడుకలో సందడి చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేసి.. తాళి కట్టి తలంబ్రాలు వేసుకుని బెల్జియం అమ్మాయి చేయి పట్టిన ఆటో రాజు అనంతరాజు.   