ఈ ఎల్లో క్రేజీ యాంట్స్ ఆకలికి అంతం లేదని.. ఏది కనిపించినా తినేస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. పంటపొలాల్ని నాశనం చేస్తున్నాయి. మేకలు, పశువుల, ఎద్దుల పుండ్లమీద దాడి చేసి.. మాంసాన్ని తినేస్తున్నాయి. దీంతో ఇప్పటికే అనేక పశువులు మృతి చెందాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేకలు, ఆవులు వంటి అనేక పశువులు చూపుని కోల్పోయాయని చెబుతున్నారు. ఎలుకలు, పిల్లులు, కుందేళ్లను, పాములు, బల్లులను ఇలా ఏది కనిపించినా గుటకాయస్వాహా అంటూ మింగేస్తున్నాయి.