
కర్ణాటకలోని మంగళూరులో గాంధీజీ ప్రత్యేక ఆలయం ఉంది. అందులో ఆయనను ప్రతిరోజూ పూజిస్తారు. మంగళూరులోని శ్రీ బ్రహ్మ బైదర్కల క్షేత్ర గరోడిలో నిర్మించారు.

మహాత్మా గాంధీ అనుచరులు ఈ ఆలయానికి వచ్చి ఆయన చెప్పినట్లు సత్యం, అహింస మార్గాన్ని అనుసరిస్తానని ప్రతిజ్ఞ చేస్తారు.

గాంధీజీ మట్టి విగ్రహాన్ని 1948 లో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ తరువాత 2006 సంవత్సరంలో ప్రజల డిమాండ్ మేరకు గాంధీజీ పాలరాయి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

గాంధీ జయంతి రోజున ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పండ్లు, స్వీట్లతో పాటు గాంధీజీ విగ్రహంపై బ్లాక్ కాఫీని పోసి ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

ఒరిస్సాలోని సంబల్పూర్ జిల్లాలోని భతారా గ్రామంలో కూడా మహాత్మా గాంధీ ఆలయం ఉంది. ఈ ఆలయంలో రాగితో చేసిన 6 అడుగుల ఎత్తైన గాంధీజీ విగ్రహం ఉంది.