Srinagar Tulip Garden: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో మన భూతల స్వర్గం.. అరుదైన ఘనత సాధించిన తులిప్​ గార్డెన్​

|

Aug 21, 2023 | 12:01 PM

ఎన్నెన్నో వర్ణాలు.. అన్నింట్లోనూ అందాలు.. వాటిని చూస్తే ఇంద్రధనుస్సు నేలపైకి వచ్చినట్లు, భూమే రంగుల తివాచీగా మారినట్లు తోస్తుంది. ఇది మనదేశంలోని జమ్ముకశ్మీర్‌లో విరబూసిన తులిప్‌ పూల ప్రత్యేకత. శ్రీనగర్‌లో ఉన్న ఇందిరాగాంధీ మెమోరియల్​ తులిప్​ గార్డెన్ అరుదైన ఘనత సాధించింది. రంగురంగుల్లో వికసించిన పూలు మైమరిపింపజేస్తున్నాయి. మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. మంచు కొండల మధ్యలో తులిప్‌ పూల సోయగాలు కనువిందు చేస్తున్నాయి.

1 / 6
జబర్వాన్​ పర్వత శ్రేణుల దిగువ భాగంలో ఉన్న ఈ తులిప్​ గార్డెన్​ వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించుకుంది. 68 రకాలతో కూడిన 1.5 మిలియన్ల తులిప్​ పువ్వులతో ఆసియాలో అతిపెద్ద గార్డెన్​గా ఈ రికార్డు సృష్టించింది.

2 / 6
ఈ మేరకు ఆగస్టు 19న జరిగిన కార్యక్రమంలో ఫ్లోరికల్చర్‌, గార్డెన్స్‌ అండ్‌ పార్క్స్‌ కమిషనర్‌ సెక్రటరీ షేక్‌ ఫయాజ్‌ అహ్మద్‌కు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అధ్యక్షుడు సంతోష్‌ శుక్లా.. గుర్తింపు పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఎడిటర్‌ దిలీప్‌ ఎన్‌ పండిత్‌, కశ్మీర్‌ అధికారులు పాల్గొన్నారు.

3 / 6
ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్‌ పుష్పాల ఉద్యానవనాలు ఉన్నాయి. 30 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న శ్రీనగర్‌లోని తులిప్‌ గార్డెన్‌ మాత్రం ఆసియా ఖండంలోనే అతిపెద్దది.

4 / 6
ఇందిరాగాంధీ మెమోరియల్​ తులిప్​ గార్డెన్​ గొప్పతనాన్ని గుర్తించినందుకు వరల్డ్ ఆఫ్​ రికార్డ్స్ బృందానికి కమిషనర్​ సెక్రటరీ షేక్ ఫయాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక చరిత్రాత్మక విజయంగా వర్ణించారు.

5 / 6
కాశ్మీర్​లో పూల సంపద.. స్థానికంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని వివరించారు. శ్రీన‌గ‌ర్‌లోని  ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా ఉంటుంది ఈ తులిప్ తోట‌. ఈ భూలోక స్వర్గాన్ని చూసేందుకు ఏటా లక్షల మంది పర్యాటకులు శ్రీనగర్‌కు తరలివస్తుంటారు.

6 / 6
శ్రీన‌గ‌ర్‌ ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా ఉంటుంది. నగర సోయగం అక్కడ విరిసే పూల‌ల్లో దాగి ఉంటుంది. రంగురంగుల పూలు ఇంద్రధనుస్సు నేలపై విరిసినట్లు, రంగుల తివాచీగా మారినట్లు  ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా ఉంటుంది తులిప్ తోట‌