
కావాల్సిన పదార్థాలు : వేప పువ్వు , చింత పండు రసం, బెల్లం తురుము, కంది పప్పు , జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, కొత్తి మీర, నెయ్యి, మిరియాలు, వెల్లుల్లి పాయలు.

తయారీ విధానం : ముందుగా వేప పువ్వును శుభ్రంగా కడికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి వేప పువ్వు వేయించి పక్కన పెట్టకోవాలి. ఇప్పుడు ఇందులోనే కంది పప్పు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకును కూడా సన్నటి మంటపై వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి.

ఇప్పుడు చింత పండు తీసుకొని, దానిని శుభ్ర పరిచి , రసం తీయాలి. అందులో వేప పువ్వు, బెల్లం తురుము, పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ఈ రసాన్ని తక్కువ మంటపై మంచిగా ఉడికించుకోవాలి. రసం బాగా మరిగిన తర్వాత అందులో నెయ్యిలో వేయించిన కందిపప్పు, పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి.

తర్వాత మళ్లీ స్టవ్ ఆన్ చేసి , కొంచెం నూనె పోసి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి, ఇవి వేగిన తర్వాత, రసంలో వేయాలి. ఆ తర్వాత కొంచెం కొత్తి మీర వేసి, 5 నిమిషాలపాటు రసం మరిగేలా చూడాలి . అంతే వేడి వేడి వేప పువ్వు రసం రెడీ. దీనిని తినడం వలన వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గడమే కాకుండా, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ముఖ్యంగా వేప పువ్వు రసం కనీసం వారంలో ఒక్కసారి అయినా తినడం వలన జలుబు, దగ్గు, వంటి సమస్యలు తగ్గిపోతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించి, డయాబెటీస్ కంట్రోల్ చేస్తుందంట.