
శుక్రుడి సంచారం వలన మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గిపోతాయి. అందరూ ఆనందంగా గడుపుతారు. ఫ్యామిలీతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి జాబ్ దొరికే ఛాన్స్ ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

తుల రాశి వారికి మే 30 తేదీన శుక్ర గ్రహం మేష రాశిలోకి ప్రవేశించడం వలన అనేక లాభాలు జరగనున్నాయి. ఆర్థికంగా మంచి పురోగతి పొందనున్నారు. వీరు ఏ వ్యాపారం చేపట్టినా కలిసి వస్తుంది. రాజకీయ రంగాలకు సంబంధం ఉన్న వ్యక్తులు పేరు ప్రతిష్టలు పొందుతారు. వృత్తి వ్యాపారల్లో మంచి లాభాలు పొందుతారు. చాలా సంతోషంగా గడుపుతారు. అప్పులు ఇవ్వకపోవడం మంచిది.

అంతే కాకుండా ఈ రాశిలో ఉన్న వారికి విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది. శని అనుగ్రహం కూడా వీరిపై ఉండటం వలన వీరి చేతిలో ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటుంది. ఉద్యోగం చేసే చోట కూడా మంచి మన్ననలు పొందుతారు. సమాజంలో మంచి గౌరవం పొందుతారు.

కుంభ రాశి వారికి ఈ శుక్రుడి సంచారం వలన చాలా లాభాలు కలగనున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారు అనేక ప్రయోజనాలు పొందుతారు. ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. అప్పులన్నీ తీరిపోయి చేతిలో డబ్బుతో చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.