
అదనపు ప్రోటీన్లను శరీరం నుంచి తొలగించబడకపోతే, రక్తంలో యూరిక్ యాసిడ్ మోతాడు పెరుగుతుంది. ఇది బొటనవేలు నుంచి చీలమండల వరకు వాపు, విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. దీనిని గౌట్ అని కూడా అంటారు. చలికాలం వస్తే కీళ్లనొప్పుల సమస్యలు పెరుగుతాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నట్లయితే శరీరంపై ఏవైనా గాయాలు ఉంటే ఆ ప్రాంతంలో దురద మొదలవుతుంది. అయితే శీతాకాలంలో ఈ కింది కూరగాయలు తినడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు..

చలికాలంలో ఆల్కహాల్ డ్రింక్స్, కొవ్వు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం యూరిక్ యాసిడ్ సమస్యను పెంచుతాయి. ఈ సీజన్ లో పాలకూర తింటే యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరగవు. అలాగే కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

చలికాలంలో బ్రోకలీ పుష్కలంగా దొరుకుతాయి. ఈ కూరగాయలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి గౌట్ సమస్యలను నివారిస్తుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

దోసకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం నుంచి అదనపు యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపుతుంది. యూరిక్ యాసిడ్‌తో ఎక్కువ కాలం బాధపడే వారి ఆహారంలో దోసకాయను చేర్చుకోవచ్చు.బీన్స్ యూరిక్ యాసిడ్ లక్షణాలను నివారిస్తుంది. బీన్స్‌లో ప్రోటీన్ ఉంటుంది. కానీ అవి యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచవు. బదులుగా సమస్యలను నివారిస్తుంది.

ఆస్పరాగస్ సాధారణంగా కూరగాయల మార్కెట్‌లో కనిపించవు. కానీ ఈ కూరగాయలు శరీరం నుంచి అదనపు యూరిక్ యాసిడ్‌లను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే బొటనవేలు నొప్పి, చీలమండ వాపు వంటి సమస్యలను నివారిస్తుంది.