
వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం, ఇంటిలోప మునిగిపోతున్న ఓడ ఫొటో ఎప్పుడూ పెట్టుకోకూడదంట. దీని వలన ఇంట్లో చాలా సమస్యలు వస్తుంటాయి. అంతే కాకుండా నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుందని చెబుతున్నారు వారు. అలాగే మునిగిపోయిన ఓడ ఫొటో ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లోని వ్యక్తుల మధ్య కలహాలు మొదలవుతాయంట.

గులాబీ మొక్క : ఇంటిలోపల ఎప్పుడూ గులాబీ మొక్క ఫొటోలను పెట్టుకోకూదంట. దీని వలన ఇంట్లో డబ్బు కొరత ఎక్కువగా వస్తుంది. అలాగే ఇంట్లో ప్రతికూలత పెరిగిపోతుందని చెబుతున్నారు పండితులు.

పిల్లలు ఏడుస్తున్న ఫొటోస్ : ఇంటిలో అందంగా నవ్వుతూ ఉన్న ఫొటోస్ పెట్టుకోవడం చాలా మంచిది. కానీ పిల్లలు ఏడుస్తున్నట్లు ఉన్న ఫొటోలు అస్సలే పెట్టకూడదంట. దీని వలన ఇంట్లో అనారోగ్య సమస్యలు తీసుకరావడమే కాకుండా ఇ ఇంట్లో ఉన్న వారికి ఒత్తిడి, మానసిక ఆందోళన పెరిగిపోతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

యుద్ధానికి సంబంధించిన ఫొటోస్ : ఇంటిలోప ఎటువంటి పరిస్థితుల్లో యుద్ధానికి సంబంధించిన ఫొటోలు పెట్టుకోకూడదంట. ముఖ్యంగా మహాభారతానికి సంబంధించినవి కూడా పెట్టుకోకూడదని దీని వలన దురదృష్టంక కలుగుతుందని, సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు పండితులు.

అదేవిధంగా నటరాజ విగ్రహం కూడా ఇంటిలో పెట్టుకోవడం మంచిది కాదంట. దీని వలన నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా పెరుగుతుందంట. అనేక సమస్యలు ఎదురవుతాయంట. అందుకే సాధ్యమైనంత వరకు నటరాజ విగ్రహం ఇంటిలోపల పెట్టుకోకూడదు అని చెబుతున్నారు పండితులు.