
బహిరంగంగా ఉంచవద్దు: కత్తులు లేదా కత్తెరలను అందరికీ కనిపించేలా బహిరంగ ప్రదేశంలో అస్సలు ఉంచకూడదు. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య అనవసర విభేదాలకు దారితీస్తుంది. వీటిని ఎల్లప్పుడూ డ్రాయర్లలో లేదా కవర్లలో భద్రపరచాలి.

బెడ్ రూమ్‌లో అస్సలు వద్దు: చాలామంది అవసరం కోసం బెడ్ రూమ్‌లో కత్తెరలను ఉంచుతుంటారు. వాస్తు ప్రకారం ఇది చాలా అశుభం. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడమే కాకుండా మానసిక ఒత్తిడి పెరిగి నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి.

విరిగిన లేదా తుప్పు పట్టినవి: ఇంట్లో విరిగిపోయిన లేదా తుప్పు పట్టిన కత్తులు ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాంటి వస్తువులు ఇంట్లో ప్రతికూలతను వ్యాపింపజేస్తాయి. కాబట్టి వాటిని వెంటనే తొలగించి కొత్త వాటిని తెచ్చుకోవడం మంచిది.

వంటగదిలో సరైన స్థానం: వంటగదిలో కత్తులు నిత్యం అవసరమే కానీ వాటిని గ్యాస్ స్టవ్ పైన లేదా దగ్గరగా ఉంచకూడదు. కత్తులను ఎల్లప్పుడూ దక్షిణం లేదా పడమర దిశలో ఉన్న అల్మారాలో ఉంచడం శుభప్రదం.

పూజా గదికి దూరంగా: దేవుడి గది లేదా పూజా స్థలం అత్యంత పవిత్రమైనది. అక్కడ కత్తులు, కత్తెర వంటి పదునైన వస్తువులను ఉంచడం వల్ల తీవ్రమైన వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇది ఇంట్లోని ప్రశాంతతను దెబ్బతీస్తుంది. కత్తులు, కత్తెరలు చిన్న వస్తువులే కావచ్చు కానీ వాటిని సరైన పద్ధతిలో ఉంచడం ద్వారా ఇంట్లో ఒత్తిడి తగ్గి ఆనందం పెరుగుతుంది.