
సాధారణ రైళ్లతో పోలిస్తే, వందే భారత్ రైళ్లు డిఫరెంట్‌గా ఉంటాయి. ఇవి మెట్రో తరహా ఆటోమేటిక్ డోర్లతో పనిచేస్తాయి. ఈ డోర్స్ ట్రైన్ స్టేషన్‌లో ఆగిన కొద్దిసేపు మాత్రమే తెరుచుకుని ఉంటాయి. ట్రైన్ స్టార్ట్ అయ్యేముందే ఇవి క్లోజ్ అవుతాయి. చాలా మంది ట్రైన్‌ను రన్నింగ్‌లో ఎక్కడ దిగడం చేస్తుంటారు.. వాటిని అరికట్టీ ప్రయాణికుల భద్రతను మరింత పెంచాలనే ఉద్దేశంతో రైల్వేశాఖ ఈ ఆటోమేటిక్ డోర్లను తీసుకోచ్చింది.

కోచ్ డోర్ మూసుకుపోతే ఏం చేయాలి?: ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చేసరికే ప్యాసింజర్ కోచ్ డోర్లు లాక్ అయిపోయినా మీరు ట్రైన్ ఎక్కవ వచ్చు అవును. రైల్వే మార్గదర్శకాల ప్రకారం.. ప్రయాణికుల డోర్లు లాక్ అయినప్పటికీ, రైలు వెనుక భాగంలో ఉండే గార్డ్ కోచ్ ద్వారా ట్రైన్‌లోకి వెళ్లవచ్చు. మీరు కచ్చితంగా ఆ ట్రైన్‌లోనే ప్రయాణించాలి అంటే డోర్ క్లోజ్ అయిన వెంటనే చివరి కోచ్ వైపు పరిగెత్తి, గార్డ్ కంపార్ట్‌మెంట్ ద్వారా ట్రైన్‌లోకి ఎంట్రీ అవ్వవచ్చు. అక్కడి నుంచి మీరు రిజర్వ్ చేసుకున్న కోచ్‌లోకి వెళ్లిపోవచ్చు. అయితే ఈ ఆప్షన్‌ను కేవలం పొరపాటున డోర్స్ క్లోజ్ అయినప్పుడు మాత్రమే యూజ్ చేయాలని అధికారులు చెబుతున్నారు.

లోపల ఉన్నప్పుడే డోర్ క్లోజ్ అయితే ఏం చేయాలి: స్టేషన్‌కు చేరుకున్న ట్రైన్ చాలా తక్కువ సమయంపై పాటు ప్లాట్‌ఫామ్‌లో ఆగుతుంది. ఒక వేళ లగేజ్ గునక ఎక్కవ ఉంటే కొన్ని సార్లు దిగడానికి లేట్ అవుతుంది. కానీ ఆలోపే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. డోర్ల వద్ద ఉండే ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్‌ను ఉపయోగించి లోకో పైలట్ లేదా రైలు సిబ్బందిని అలర్ట్ చేయాలి. అప్పటికీ ట్రైన్ స్టార్ట్ అవ్వకపోతే.. వాళ్లు వెంటనే డోర్స్ ఓపెన్ చేసి మీరు దిగేందుకు సహాకరిరిస్తారు.

లోపల ఉండగా ట్రైన్ స్టేషన్ దాడితే: ఒక వేళ మీరు లోపల ఉన్నప్పుడే ట్రైన్ స్టేషన్ దాటి వెళ్లిపోతే.. మీరు మొదటి చేయాల్సిన పనేమిటంటే.. వెంటనే వెళ్లి టీసీని కలవాలి జరిగిన విషయాన్ని వాళ్లకు చెప్పాలి. లేకపోతే మీ టికెట్ వ్యాలిడిటీ దాటి ప్రయాణిస్తున్నారనుకొని మీకు ఫైన్ వేసే ప్రమాదం ఉంది. కాబట్టి టీసీకి చెబితే రైల్వే నిబంధనల ప్రకారం వర్తించే ఛార్జీలు చెల్లించిన తర్వాత, తదుపరి స్టేషన్‌లో దిగడానికి అనుమతిస్తారు.

మెట్రో తరహా డిసిప్లిన్ : కాబట్టి మీరు వందే భారత్ రైళ్లలో ప్రయాణించేటప్పుడు మెట్రోలో ఎలాంటి రూల్స్ అయితే ఫాలో అవుతారో ఇక్కడ కూడా అవే ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. మీ డెస్టినేషన్ రాకముందే లగేజీతో డోర్ల దగ్గర దిగేందుకు రెడీగా ఉండాలని.. చివరి నిమిషంలో కాకుండా, డోర్లు మూసుకునే లోపే రైలు బోర్డింగ్ పూర్తి చేసుకోవాలని తెలిపారు.