
ఉపాసన, తన అత్తయ్య, చిరంజీవి సతీమణి సురేఖ తో కలిసి అత్తమ్మాస్ కిచెన్ అనే బిజినెస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి ఎన్నో డిఫరెంట్ వంటలను ప్రిపేర్ చేస్తూ, అమ్ముతుంటారు. అయితే తాజాగా ఉపాసన తన అత్తమ్మతో కలిసి ఇంట్లో స్పెషల్ పూజ నిర్వహించారు. దానికి సంబంధించిన ఫొటోస్, వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఉపాసన పూజకు సంబంధించిన వీడియో షేర్ చేయగా, అందులో తన అత్తమ్మ పూజ చేసే విధానం, దాని నియమాలు పద్ధతులు అన్నింటిని చక్కగా తెలుసుకుంటూ, అత్తమ్మ చెప్పిన విధంగా ప్రతి నియమాన్ని పాటించింది. అమ్మావారికి పూజచేస్తూ, అత్తమ్మ చెప్పిన ప్రతి ఆ చారాన్ని ఫాలో అయ్యింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ ఉపాసన తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అందులో వీడియోలో పూజకు సంబంధించిన కొన్ని విషయాలు అభిమానులతో పంచుకుంది. మా ఫ్యామిలీలో ఏ చిన్న పండుగైనా సరే చాలా ఘనంగా జరుపుకుంటాం. అత్తమ్మ ఏం చేసినా, ఫ్యామిలీ మొత్తం కలిసి పండుగ చేసుకునేలా చేస్తుంది. ఫ్యామిలీ అంత కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పుకొచ్చింది.

అలాగే ఈ రోజు నేను అత్తమ్మ నుంచి పూజ, పండుగకు సంబంధించిన చాలా విషయాలు నేర్చుకున్నాను, పూజా విధనం, ఆచారాలు, పూజ చేసే క్రమంలో ఎలాంటి నియమాలు పాటించాలి. దీని విశిష్టత ఇలా చాలా అంశాల గురించి, అత్తమ్మ నుంచి నేర్చుకున్నానంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోని పూజ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన వారందరూ, మీ బాండింగ్ సూపర్, క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.