రాఘవేంద్ర స్వామి వెలసిన కర్నూలు జిల్లా మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. సుమారు రూ.300 కోట్లతో నిర్మించనున్న శ్రీరాముడి విగ్రహానికి కేంద్ర మంత్రి అమిత్ షా వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రాలయ పీఠాధిపతి డాక్టర్ సుబుధేంద్ర తీర్థ భూమిపూజ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు కేంద్ర మంత్ర అమిత్ షా. జైశ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పంచలోహ విగ్రహ నిర్మాణం జరగనుంది.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు, ‘జై శ్రీరామ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకులు రాము, శ్రీధర్, మంత్రి గుమ్మనూరు జయరాం, భాజపా నేత టీజీ వెంకటేశ్, పెద్ద ఎత్తున గ్రామస్థులు పాల్గొన్నారు.
కాగా రెండేళ్లలో ఈ విగ్రహం తయారీని పూర్తి చేసి ఆ తర్వాత ప్రతిష్ఠిస్తారు. అనంతరం ఆ విగ్రహానికి ముందు రామాలయం నిర్మిస్తారు.