
చాలా వరకు ఇంటిలో పిల్లి చనిపోవడం అస్సలే మంచిది కాదు అంటారు. మరీ ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో తమ ఇంటిలో పిల్లి చనిపోతే, పది రోజుల పాటు వంట, పూజ చేయరు. ఎందుకంటే ఇది ఇంటిలో ప్రతికూలతను పెంపొందిస్తుందంట. అందువలన ఇంటిలో ఎలాంటి పూజలు చేయరు.

ఇంటిలో పిల్లి చనిపోవడం అంటే ఆ ఇంటిలో ప్రతికూలత ఎక్కవగా ఉన్నట్లు. అంతే కాకుండా పిల్లి చనిపోయిన తర్వాత ఆ ఇంటి వారు వీలైనంత వరకు ఎలాంటి శుభకార్యాలు జరపకూడదు, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదంట. లేకపోతే ఇది అనేక రకాల సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర పండితులు.

అంతే కాకుండా ఆ ఇంటిని గంగాజలం, ఉప్పు, గోమూత్రంతో శుభ్రం చేయడం చాలా శుభ ప్రదం. ఇలా చేసిన తర్వాత కొన్ని ప్రత్యేక పూజలు పరిహారాలు చేసి, జీవికి మోక్షం కలగడానికి చేయాల్సిన కార్యక్రమాలు చేస్తారు. ఇలా చేసిన తర్వాత ఆ ఇంటిలో ఎలాంటి ప్రతికూల శక్తి ఉండదు. అంతే కాకుండా శుభకార్యాలు కూడా చేసుకోవడంలో తప్పు లేదు అని చెబుతుంటారు.

ఇక కొంత మంది మాత్రం పిల్లి చనిపోయిన తర్వాత ఆ ప్రదేశాన్ని వెంటనే క్లీన్ చేయాలని చెప్పుకొస్తుంటారు. ఎందుకంటే జంతువు చనిపోయినప్పుడు దాని మృతదేహం నుంచి ఫంగస్ , బ్యాక్టీరియా వంటివి ఇతరులకు వ్యాపించే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆ ఇంటిని శుభ్రం చేయాలి. వంట చేయకూడదు అంటుంటారు కొందరు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు