వర్షం పడే ముందు ఆకాశంలో ఉరుములు ఎందుకు వస్తాయో తెలుసా?

Updated on: Jun 13, 2026 | 4:17 PM

వర్షాకాలం ప్రారంభం అయ్యింది. ఈ సారి వర్షాలు కాస్త ఆలస్యంగా పడినా, పలు చోట్ల దంచి కొడుతున్నాయి. తెలుగు రాష్టాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? వర్షం పడే ముందు మెరుపులు, ఉరుములు వస్తుంటాయి. మరి అసలు వర్షం పడే ముందు ఉరుములు ఎందుకు వస్తాయి? అసలు ఆ శబ్ధాల వెనకున్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
వర్షం పడటం చాలా మంది సంతోషాన్ని, మానసిక ఆనందాన్ని ఇస్తుంది. అయితే వర్షం పడటానికి కొంచెం సమయం ముందు ఆకాశం నల్లటి మేఘాలతో నిండి పోవడమే కాకుండా ఉరుముల శబ్ధం కూడా వినిపిస్తుంటుంది. దీంతో మన పెద్దవారు ఉరుముతుంది. వర్షం బాగా పడుతుంది అని చెబుతుంటారు.

2 / 5
కొన్ని సార్లు వర్షం పడటానికి ముందు ఉరుములు ఉరిమితే, మరికొన్ని సార్లు వర్షం పడే సమయంలో ఉరుములు వస్తుంటాయి. కొన్నిసార్లు అయితే ఉరుములు వచ్చిన తర్వాత భారీ వర్షం కురుస్తుంది. మరి అసలు ఈ ఉరుములు అంటే? ఏంటీ? ఆకాశంలో ఏర్పడే ఈ శబ్ధాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి ఎలా ఏర్పడుతాయో చూద్దాం.

3 / 5
కొన్ని కథనాల ప్రకారం, ఆకాశంలో మేఘాలు చిన్న చిన్న నీటి  బిందువులు లేదా మంచు కణాలతో తయారు అవుతాయి. ఇందులో కొన్ని మేఘాలు ధనాత్మక విద్యుత్ ప్రవాహాన్ని కలిగి ఉంటే, మరికొన్ని రుణాత్మక విద్యుత్ ప్రవాహాన్ని కలిగి ఉంటాయి. ఇవి చాలా వేగంతో దూసుకెళ్తుంటాయి.ఈ రెండు వేర్వేరు విద్యుత్ ప్రవాహం కలిగిన మేఘాలు ఒక్కసారి దగ్గరకు వచ్చినప్పుడు, విద్యుత్ ఉత్పత్తి అయ్యి మెరుపులు రావడం జరుగుతుంది.

4 / 5
ఈ సమయంలో గాలి ఒక్కసారిగా చాలా ఎక్కువగా వేడి ఎక్కుతుంది. గాలి ఒత్తిడితో పెద్ద శబ్దాన్ని చేస్తుంది. దీనినే ఉరుము అంటారు.  ఉదాహరణ చెప్పాలి అంటే, మీ బండి లేదా సైకిల్ ట్యూబ్ పగులినప్పుడు, దానిలో ఉండే గాలి చాలా ఒత్తిడితో బయటకు రావడం జరుగుతుంది. ఈ సమయంలో ఏదో పేలిన శబ్ధం వినిపిస్తుంది. అలాగే మేఘాలలో గాలి ఒత్తిడికి గురి అయినప్పుడు శబ్ధాన్ని చేస్తాయంట.

5 / 5
అంతే కాకుండా, కొన్ని సార్లు  మేఘాలలో గాలి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అది శబ్ధం చేస్తుందంట. ఇలా వర్షం పడే ముందు ఉరుములు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. నోట్: పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us