- Telugu News Photo Gallery TV9 World Travel and Tourism Festival papon concert at Major Dhyanchand Stadium delhi
WTTF: టీవీ9 వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్‌లో దుమ్మురేపిన పెపాన్ మ్యూజిక్ కన్సర్ట్
భారతదేశంలోని నంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం వేదికగా 'వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్' కొనసాగుతోంది.. శుక్రవారం ప్రారంభమైన టీవీ9 వరల్డ్ ట్రావెల్ & టూరిజం ఫెస్టివల్ ఆదివారం (ఫిబ్రవరి 16) వరకు కొనసాగనుంది..
Updated on: Feb 15, 2025 | 10:34 AM

భారతదేశంలోని నంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం వేదికగా 'వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్' కొనసాగుతోంది.. శుక్రవారం ప్రారంభమైన టీవీ9 వరల్డ్ ట్రావెల్ & టూరిజం ఫెస్టివల్ ఆదివారం (ఫిబ్రవరి 16) వరకు కొనసాగనుంది.. TV9 నెట్‌వర్క్, రెడ్ హ్యాట్ కమ్యూనికేషన్స్ సంయుక్తంగా వరల్డ్ ట్రావెల్ & టూరిజం ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖులతోపాటు వందలాది మంది పాల్గొంటూ టీవీ9 చొరవను అభినందిస్తున్నారు.

అయితే.. 'ది వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్' ద్వారా, TV9 మీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది.. ఇక్కడ మీరు మీ భాగస్వామితో కలిసి అదిరిపోయే మ్యూజిక్ తో ఎంజాయ్ చేయవచ్చు.. సాయంత్రం వేళ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను ఆనందించవచ్చు..

తొలిరోజు.. శుక్రవారం సాయంత్రం దేశంలోని ప్రసిద్ధ పాప్ గాయకుడు పెపాన్ వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్ ను మరింత చిరస్మరణీయంగా మార్చాడు. తన అందమైన స్వరంతో ఉర్రూతలూగించాడు. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్ ను చాలామంది సందర్శించారు. ఒంటరిగా లేదా వారి స్నేహితులు, సహోద్యోగులు, భాగస్వాములతో కలిసి వేలాదిగా సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో పెపాన్ పాటలతో వాలెంటైన్స్ డే మరింత అందంగా మారింది. పెపాన్ అనేక అద్భుతమైన పాటలు పాడాడు.. తన ప్రత్యేకమైన స్వరంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు.

పెపాన్ అసలు పేరు అంగారాగ్ మహంత. పెపోన్ అస్సాం రాష్ట్ర నివాసి.. బాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన గానానికి ప్రసిద్ధి చెందాడు. హిందీతో పాటు, పెపోన్ బెంగాలీ, తమిళం, మరాఠీ వంటి అనేక భాషలలో కూడా పాటలు పాడారు. పెపోన్ 'బర్ఫీ', 'సుల్తాన్', 'హమారీ అధూరి కహానీ', 'దమ్ లగా కే హైషా', 'బజరంగీ భాయిజాన్', 'కరీబ్-కరీబ్ సింగిల్' వంటి అనేక చిత్రాలకు పాటలు పాడారు.

కాగా.. టీవీ9 వరల్డ్ ట్రావెల్ & టూరిజం ఫెస్టివల్ ను బీజేపీ ఎంపీ మహేష్ శర్మ ప్రశంసించారు. విభిన్న సంస్కృతులు, ఎన్నో ప్రకృతి ప్రసాదించిన అందాలకు ప్రసిద్ధి చెందిన భారత దేశంలో, ఇటువంటి కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవన్నారు. శుక్రవారం సెషన్ లో ప్రయాణ చర్చలు, సెలవుల ప్రణాళిక, రోజూవారి కార్యకలాపాలు, పర్యావరణ పర్యాటకానికి వెళ్లడం, ఎకో టూరిజం, ప్రణాళిక వేసుకుని ప్రయాణించడం, సంగీతంతోపాటు సంస్కృతిలోకి ప్రయాణం వంటి అనేక విషయాలపై చర్చలు జరిగాయి..




