Turmeric Milk: పాలల్లో చిటికెడు పసుపు కలిపి తాగితే మంచిదే..! కానీ వీరికి మాత్రం విషంతో సమానం..

|

Nov 13, 2024 | 9:09 PM

ఆరోగ్యంగా ఉండాలంటే రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు గ్లాసుడు పాలల్లో చిటికెడు పసుపు వేసి తాగారంటే రోగాల బారీన పడకుండా కాపాడుకోవచ్చు. అయితే అందరికీ ఈ పాలు మంచిది కాదు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వీటిని తాగారంటే గరళంగా మారే అవకాశం ఉంది..

1 / 5
పసుపు కలిపిన పాలలో ఔషధ గుణాలుంటాయి. దీనిని తాగడం వల్ల ఆరోగ్యంపై చాలా సానుకూల ప్రభావాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉండటానికి చలికాలంలో పసుపు కలిపిన పాలు తాగాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు. ఇది రోగనిరోధక శక్తిని బలపరిచే సహజ పానీయం. కానీ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పసుపు పాలు తాగకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

2 / 5
డయాబెటిక్, కీమోథెరపీ మందులు తీసుకునేవారు పసుపు కలిపిన పాలు తాగకూడదు. ఇవే కాకుండా ఏదైనా మందులు తీసుకుంటే మాత్రం పసుపు కలిపిన పాలు తాగే ముందు వైద్యుడిని తప్పనిసరిగా సంప్రదించాలి.

3 / 5
మీరు జీర్ణకోశ సమస్యలతో బాధపడుతుంటే పసుపు కలిపిన పాలు తాగకూడదు. ఇది గ్యాస్, ఉబ్బరం, అతిసారం, కడుపు నొప్పి, వికారం, తిమ్మిరిని కలిగిస్తుంది.

4 / 5
పసుపు కలిపిన పాలు తాగితే దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలెర్జీ ప్రతిచర్యలకు దారి తీస్తుంది. మీలో కూడా ఈ లక్షణం కనిపిస్తే, పసుపు కలిపిన పాలు తాగడం మానేసి, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

5 / 5
పసుపు పిత్త ఉత్పత్తిని సక్రియం చేస్తుంది. ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే ఉన్న పిత్తాశయ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. పసుపును అధిక మోతాదులో తీసుకుంటే కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు పెరుగుతాయి.