
మన దేశంలో ఉత్పత్తి చేసిన పసుపులో 78% ప్రతి యేట ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. దీనిని ప్రపంచవ్యాప్తంగా పసుపుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకు ఏకైక కారణం పసుపులోని ఆరోగ్య ప్రయోజనాలు. పసుపును ఆయుర్వేద, చైనీస్ వైద్యంలో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నుంచి ఆర్థరైటిస్‌ను నివారించడం, రోగనిరోధక శక్తిని పెంచడం వరకు పసుపు సహాయపడుతుంది.

పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైనది. ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

రోజూ ఒక చెంచా పసుపు పొడి లేదా పచ్చి పసుపు ముక్క తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పసుపును ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా, క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు. క్రమం తప్పకుండా కర్కుమిన్ తీసుకుంటే బరువు కూడా తగ్గొచ్చు. ఊబకాయంతో బాధపడుతున్న చాలా మంది కర్కుమిన్ సప్లిమెంట్లను తీసుకుంటారు. కానీ ఇది పసుపులో తేలికగా దొరుకుతుంది. కాబట్టి పసుపును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చు.

పసుపు జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఇది జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. ఉబ్బరం లక్షణాలను నివారించడంలో పసుపు సహాయపడుతుంది. పసుపు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గిస్తుంది. అయితే పసుపును రోజూ ఎలా తినాలో ఇక్కడ కొన్ని మార్గాలు సూచిస్తున్నాం. అవేంతో తెలుసుకుందాం..

సాధారణంగా, పసుపును వంటల్లో ప్రతిరోజూ ఉపయోగింస్తుంటాం. పసుపు టీ తయారు చేసి తాగవచ్చు. పచ్చి పసుపు, అల్లం వేడి నీటిలో ఉడకబెట్టి టీ తయారు చేసుకోవచ్చు. పచ్చి పసుపుకు బదులుగా పొడి పసుపును కూడా ఉపయోగించవచ్చు. ఇందులో కాస్తింత మిరియాల పొడి కలుపుకుని తాగవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.