తిరుమల వెళ్లేవారికి బిగ్‌ అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల.. ఈ డేట్స్ మర్చిపోకండి!

Edited By:

Updated on: Aug 16, 2026 | 8:58 AM

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి వుండే భక్తులకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలను ప్రకటించింది. నవంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే తిరుమల శ్రీవారి దర్శనాలు, గదుల కోటా వివరాలపై స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

1 / 5
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. నవంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలను తాజాగా టీటీడీ ప్రకటించింది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

2 / 5
ఆర్జిత సేవా టికెట్ల : కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. అలాగే వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

3 / 5
ఇక అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుండగా, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఇక వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది టీటీడీ.

4 / 5
అలాగే ఆగస్ట్‌ 25న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఇక తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఇక భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ పేర్కొంది.

5 / 5
ఈ నేపథ్యంలో భక్తులకు టీటీడీ మరికొన్ని సూచనలు కూడా చేసింది. భక్తులు ఎవరూ సోషల్‌ మీడియాలో వచ్చే ప్రకటనలు చూసి టికెట్స్ ఇప్పిస్తామంటే నమ్మవద్దని.. కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి మాత్రమే టికెట్లు జారీ చేస్తారని.. వాటిలో మాత్రమే టికెట్లను పొందాలని సూచించింది. ఎవరైనా టికెట్స్ ఇప్పిస్తామంటే నమ్మవద్దని.. అలాంటివారిపై వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరింది. శ్రీవారికి దర్శనానికి వచ్చే భక్తులు ఈ విషకాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలని కోరింది.

Loading...
Unable to load recommendations.
Follow Us