
రకరకాల ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది తెలగాణ ఆర్టీసీ. ఇందులో భాగంగానే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఆఫర్లను అందిస్తున్నాయి.

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనర్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం ప్రత్యేక టికెట్లను మంజూరు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఫ్యామిలీ-24 టికెట్ పేరుతో అద్భుమతైన అవకాశాన్ని తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి శని,ఆదివారాల్లో ప్రయాణించే వారికి ఈ సదుపాయం కల్పించారు.

నలుగురు 24 గంటల పాటు సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడినైనా ప్రయాణించవచ్చు.

సాధారణంగా సిటీ బస్సుల్లో డే పాస్ తీసుకోవాలంటే ఒక్కరికి రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ ఫ్యామిలీ - 24 టికెట్ ద్వారా నలుగురికి రూ. 300 చెల్లిస్తే సరిపోతుంది. ఈ టికెట్ బస్ కండకర్ల దగ్గర అందుబాటులో ఉంటుంది.