Skin Care Tips: చిన్న వయస్సులోనే మొహంపై ముడతలు కనిపిస్తున్నాయా..? ఈ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేయండి..

|

Mar 20, 2022 | 8:36 AM

Homemade Face pack: మనం తీసుకునే ఆహారం, కాలుష్యం కారణంగా.. చిన్న వయస్సులోనే మొహంపై ముడతలు కనిపిస్తున్నాయి. ఇలా ఉండటం వల్ల ఇబ్బందితగా మారుతుంది. సాధారణంగా 40 ఏళ్ల తర్వాత ముఖంపై ముడతలు, మచ్చలు కనిపిస్తాయి. కానీ ఈ రోజుల్లో చిన్న వయస్సు వారికి కూడా కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే కొన్ని ఫేస్ ప్యాక్‌లతో ముడతలకు చెక్ పెట్టవచ్చు.

1 / 6
అయితే కొన్ని ఫేస్ ప్యాక్‌లు ఇంట్లోనే తయారు చేసుకోవడం ద్వారా మొహంపై ముడతలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆ 5 ఫేస్ ప్యాక్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 6
పసుపు - పెరుగు: చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచే పసుపు ఫేస్ ప్యాక్‌ను తయారు చేయడం చాలా సులభం. ఒక కప్పు పెరుగులో అర టీస్పూన్ పచ్చి పసుపు రసాన్ని, లేదా పసుపు పొడిని కలపండి. ఆ పేస్ట్‌ను ముఖంతోపాటు చేతులు, మెడపై కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పేస్ట్ ఆరిపోయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

3 / 6
అరటిపండు - తేనె: ఒక గిన్నెలో ఒక చెంచా తేనె తీసుకుని అందులో మెత్తగా చేసిన అరటిపండును కలపాలి. ఇప్పుడు ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం మృదువుగా మారడంతోనపాటు కాంతివంతంగా మెరుస్తుంది.

4 / 6
బొప్పాయి ఫేస్ ప్యాక్: ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తాయి. ఈ ప్యాక్ చేయడానికి.. ముందు బొప్పాయి తీసుకుని బాగా మెత్తగా చేయాలి. ఇప్పుడు ఈ ప్యాక్‌ని ముఖం, మెడకు అప్లై చేసి కొంతసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది వృద్ధాప్య ఛాయలను తగ్గించడమే కాకుండా, చర్మానికి మెరుపును కూడా తెస్తుంది.

5 / 6
పప్పు దినుసులు: వృద్ధాప్య లక్షణాలను తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయని నిపుణులు పేర్కొంటారు. శనగపిండిలో మసూర్ పప్పు పొడి, రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించాలి. ఈ పేస్ట్ ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

6 / 6
కీర దోసకాయ - అలోవెరా: కొన్నిసార్లు చర్మం హైడ్రేట్ గా లేకపోవడం వల్ల కూడా ముడతల సమస్య రావచ్చు. దోసకాయ - కలబంద రెండూ చర్మం హైడ్రేషన్‌గా ఉంచడంలో మంచిగా పని చేస్తాయి. రెండు చెంచాల తురిమిన దోసకాయ రసాన్ని తీసుకుని దానికి ఒక చెంచా అలోవెరా జెల్ కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖంపై సుమారు 30 నిమిషాల పాటు అప్లై చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.