
బరువు అదుపులో ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సమతుల్య ఆహారం కూడా తీసుకోవాలి. సరైన ఆహారం తినడం మాత్రమేకాకుండా సరైన సమయంలో తినడం కూడా చాలా ముఖ్యం. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండే స్నాక్స్ తినడం వల్ల బరువు సులభంగా తగ్గించుకోవచ్చు. బరువు తగ్గడానికి ఈ 5 రకాల స్నాక్స్ ట్రై చేయండి..

స్వీట్ కార్న్ చాట్.. ముందుగాఉడకబెట్టిన స్వీట్ కార్న్‌లో నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిపాయలు, దోసకాయ ముక్కలను వేసుకుని స్వీట్ కార్న్ చాట్ తయారు చేసుకోవాలి.

మఖానాతో కూడా స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. 1/2 స్పూన్ నెయ్యి లేదా వెన్న పాన్‌లో వేసి చేసుకోవాలి. 1 కప్పు మఖానా వేసి 4-5 నిమిషాలపాటు వేయించుకోవాలి. అనంతరం ఉప్పు, మిరియాల పొడి చల్లి తింటే రుచిగా ఉంటుంది.

పుల్లని పెరుగుతో బరువు తగ్గించుకోవచ్చు. పుల్లటి పెరుగులో 1 స్పూన్ తేనె మిక్స్ చేసుకోవాలి. దానిలో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, అరటి, యాపిల్, ద్రాక్ష వంటి పండ్లను మిక్స్ చేసి తినాలి. ఇది ఆరోగ్యానికే కాకుండా పొట్టలోని పేగులను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

శనగ పిండితో రుచి కరమైన స్నాక్స్.. 1 కప్పు శెనగపిండికి 2 కప్పుల పెరుగు, 2 స్పూన్ పాలు, 1/2 స్పూన్ జవాన్, 1/2 స్పూన్ కారం పొడి, 1/2 కసౌరీ మేతి పొడి, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి దోస పిండిలా బాగా కలుపుకోవాలి. పెనం మీద గరిటెతో దోసలా వేసుకుని కొద్దిగా నెయ్యి వేసి దోరగా కాల్చుకుంటే సరి. అలాగే.. బాదం, వాల్‌నట్, వేరుశెనగ, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, ఎండిన క్రాన్‌బెర్రీస్, ఎండుద్రాక్షలను ఒక పాత్రలో వేసుకుని ఆకలిగా అనిపించినప్పుడల్లా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది.