Fennel Seed Water : సోంపు తినడం కాదు.. ఇలా వాటర్‌లో కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా?

|

May 08, 2024 | 1:45 PM

దాదాపుగా అందరూ సోంపును వాడుతుంటారు. ఎక్కువ మందికి భోజనం తర్వాత కాస్త సోంపు నోట్లో వేసుకునే అలవాటు ఉంటుంది. సోంపు లో ఐరన్, మినరల్స్, పొటాషియం,విటమిన్ సి, జింక్ ఫాస్పరస్, మాంగనీస్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, ఇలా సోంపు తినడం కాదు.. ప్రతిరోజూ ఈ సోంపు గింజల నీళ్లను తీసుకోవడం ద్వారా అనేక అరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
Fennel Seed Water: సోంపు గింజలలో బయోయాక్టివ్ కాంపౌండ్స్ కారణంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఆహారంలో సోంపు గింజల వాటర్‌ను చేర్చుకోవడం ద్వారా సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించవచ్చు. సోంపు గింజలలో అనెథోల్ వంటి నూనెలను కలిగి ఉంటాయి. జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. జీర్ణక్రియలో సాయపడతాయి. ఉబ్బరం తగ్గడమే కాకుండా మృదువైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. తద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు.

2 / 5
Fennel Seed Water : సోంపు గింజలలో కార్మినేటివ్ లక్షణాలను కలిగి ఉంటాయి. జీర్ణశయాంతర ప్రేగులలోని కండరాలను కదిలించడంలో గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గించడంలో సాయపడతాయి. సోంపు గింజల నీటిలో మంటను తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణవ్యవస్థలో కలిగే ఎసిడిటీని తగ్గించడం ద్వారా అజీర్ణం, గుండెల్లో మంటను తగ్గించడంలో సాయపడతాయి.

3 / 5
Fennel Seed Water : కొన్ని అధ్యయనాల ప్రకారం.. సోంపు గింజలలోని సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. భోజనం తర్వాత రక్తంలో చక్కెరను తగ్గించడంలో సాయపడతాయని సూచిస్తున్నాయి. మధుమేహం ఉన్న వ్యక్తులకు లేదా డయాబెటిస్ రిస్క్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

4 / 5
Fennel Seed Water : సోంపు గింజల వాటర్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. జీవక్రియను పెంచడంలోనూ బరువు తగ్గడంలోనూ సాయపడుతుంది. అదనంగా, మూత్రవిసర్జన సాపీగా ఉంటుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. సోంపు గింజలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. సోంపు గింజల నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వయస్సు-సంబంధిత మచ్చలు తగ్గుతాయి. ఇతర కంటి అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.

5 / 5
Fennel Seed Water : విటమిన్ సి, ఐరన్ వంటి సోంపు గింజలలో ఉండే విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. సోంపు గింజల నీటిని తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల నుంచి రక్షణ అందిస్తుంది. సోంపు గింజలలో పొటాషియం ఉంటుంది. సోడియం లవణాలను ఎదుర్కోవడం ద్వారా రక్తపోటును నియంత్రిస్తుంది. సోంపు గింజలలోని ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సాయపడుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.