
అటుకుల పెసర్ల ఉప్మాకు కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు ఉప్మా రవ్వ , పావు కప్పు పెసరపప్పు, ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర కప్పు పల్లీలు , ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు టీస్పూన్, సరిపడా నూనె, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, నీళ్లు కూడా తీసుకోవాలి.

అటుకుల పెసర్ల ఉప్మా తయారీ విధానం : ముందుగా అటుకులను తీసుకుని బాగా కడిగి 15 నిముషాల పాటు పెట్టుకోవాలి. అయితే, వీటిని ఎంత బాగా నానబెడితే అంత బాగా అటుకులు మెత్తగా అవుతాయి కాబట్టి, అయితే, ఇంకా ఎక్కువ సేపు ఇలాగే ఉంచకండి. ఆ తర్వాత పెసరపప్పును ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి.

పెసరపప్పును ఇలా వేయించుకోవాలి : పావు కప్పు పెసరపప్పును తీసుకుని ఉడికించాలి. అయితే, బాగా మెత్తగా కాకుండా కొంచం ఉడికించిన కూడా సరిపోతోంది. మళ్ళీ ఇంకో పాన్‌లో నూనె వేసి వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. రంగు మారిన తర్వాత శనగపప్పు, ఇంకా జీడిపప్పు కూడా వేసి వేయించాలి.

పాన్‌లో నెయ్యి వేసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర కూడా వేసి రంగు మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, జీడిపప్పు వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించాలి. ఆ తర్వాత దీనిలో ఐదు పచ్చిమిర్చి, ఇంకా అల్లం, కరివేపాకు ఆకులు కూడా దీనిలో వేసి వేయించాలి. ఇంకా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.

చివర్లో ఉడికించిన పెసరపప్పు, రవ్వ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కూడా వేసి, కొద్దీ సేపటి వరకు మూత పెట్టి అలాగే ఉంచాలి. అది ఇంకా ఉదకకపోతే మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. దించే ముందు కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర కూడా వేస్తె ఇంకా టేస్టీగా ఉంటుంది.