
జుట్టు, చర్మ సంరక్షణలో కొబ్బరి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనేక పరిశోధనలలో నిరూపితమయింది. కొబ్బరి నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల జుట్టు మృదువుగా మారడమేకాక, జుట్టు సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది.

జుట్టు రాలిపోయే సమస్య ఉంటే జుట్టుకు కొబ్బరి నూనెను రాయాలి. కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నందున జుట్టుకు అది పోషణను అందిస్తుంది. జుట్టుకు ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

కొబ్బరి నూనెను జుట్టుకు పట్టించడం వల్ల చుండ్రు, దురద సమస్యలు కూడా నయం అవుతాయి.

కొబ్బరి నూనెతో జుట్టును క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల జుట్టు వేగంగా పెరగడంతోపాటు జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.

జుట్టు సంరక్షణ కోసం దానిని కడగడానికి 3-4 గంటల ముందు దానికి కొబ్బరి నూనె రాయండి. తద్వారా జుట్టు పాడవకుండా కాపాడుకోవచ్చు.