
దేశంలోనే కాకుండా విదేశీ పర్యాటకులలో కూడా చాలా ప్రసిద్ధి చెందిన అనేక హిల్ స్టేషన్లు ఉన్నాయి. మీరు బడ్జెట్‌లో హిల్ స్టేషన్‌ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే వీటిపై ఓ లుక్కేయడం మంచిది. ఎందుకంటే తక్కువ ఖర్చులోనే పర్యటించి రావచ్చు. అందుకు మీరు ఇక్కడ ఇచ్చిన ఈ చిట్కాలను అనుసరించవచ్చు.

ఆఫ్ సీజన్ - ఆఫ్ సీజన్‌లో కూడా మీరు హిల్ స్టేషన్‌ని సందర్శించవచ్చు. ఉదాహరణకు, మీరు హిమాచల్ ప్రదేశ్‌కు వెళుతున్నట్లయితే మీరు చాలా తక్కువ బడ్జెట్‌తో జూలై నుంచి సెప్టెంబర్, జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ప్రయాణించవచ్చు. అయితే ఈ నెలలో వెళ్లే ముందు వాతావరణాన్ని తనిఖీ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

తగ్గింపులు - బడ్జెట్‌లో ఎక్కువ భాగం ప్రయాణ ఖర్చులు అలాగే హోటల్ బుకింగ్‌ల వైపు వెళుతుంది. కానీ మీరు బాగా ప్లాన్ చేసుకుంటే మీరు చౌకైన హోమ్‌స్టేలను కనుగొనవచ్చు. మీరు తక్కువ రైలు, బస్సు ఛార్జీల కోసం ఆన్‌లైన్ డిస్కౌంట్‌లను కనుగొనవచ్చు.

ఆహారం - బయట తినడం చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే మీరు స్థానిక ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. దాని సహాయంతో మీరు ఇక్కడి స్థలం గురించి మరింత తెలుసుకుంటారు. మీ డబ్బును కూడా ఆదా చేస్తారు. క్యాంప్ - మీకు కొంచెం క్యాంపింగ్ అనుభవం ఉంటే, మీరు హిమాచల్ పర్యటనలో చాలా డబ్బు ఆదా చేయవచ్చు. అయితే దీని కోసం మీరు క్యాంపులు ఉన్న ప్రదేశాల గురించి తెలుసుకోవాలి.

కలిసి వెళ్లండి - పెద్ద సమూహాలు హోటల్‌లు, ప్రయాణాలపై మెరుగైన తగ్గింపులను పొందుతాయి. మీరు చాలా మంచి, చౌకైన టూర్ ప్యాకేజీలను కనుగొనవచ్చు. ఇది కాకుండా మీరు చాలా రోజులు కలిసి ఉండటానికి ఒక పెద్ద గెస్ట్‌హౌస్‌ను కూడా అద్దెకు తీసుకోవచ్చు.