పిల్లల కళ్ళకు ఆరోగ్యాన్నిచ్చే పల్లెటూరి దప్పళం..ఇలా చేస్తే నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు

Updated on: Jun 06, 2026 | 7:50 AM

తెలుగు ఇళ్లలో ఎంతో ఫేమస్ అయిన సంప్రదాయ వంటకం ఈ దప్పళం. దీని రుచి తియ్య తియ్యగా తీపి, పులుపు, ఒక టేబుల్ స్పూన్ కారం కలయికతో ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనిని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్ట్ సూపర్. లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5
గుమ్మడికాయ దప్పళంకు కావలసిన పదార్థాలు: రెండు కప్పులు గుమ్మడికాయ ముక్కలు, నిమ్మకాయంత చింతపండు, కొద్దిగా బెల్లం, నాలుగు పచ్చిమిర్చి, రెండు ఎండుమిర్చి ,  ఒక టేబుల్ స్పూన్ కారం , అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు , ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు, కొద్దిగా కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

3 / 5

గుమ్మడికాయ దప్పళం తయారీ విధానం: ముందుగా  నిమ్మకాయంత సైజంత చింతపండును తీసుకుని నానబెట్టి దాని నుంచి రసం తీసుకోవాలి. ఆ తరువాత గుమ్మడికాయను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. ఇప్పుడు ఒక పాత్రలో గుమ్మడికాయ ముక్కలు, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి మెత్తగా ఉడికించాలి.

4 / 5
ఈ గుమ్మడికాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత దానిలో చింతపండు రసం, అర టేబుల్ స్పూన్ కారం, ఇంకా బెల్లం కూడా వేసి 
10 నిమిషాల పాటు మరిగించాలి. ఇప్పుడు పాన్‌లో ఆయిల్ లో వేడి చేసి అర టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అర టీ స్పూన్  శనగపప్పు, అర టీ స్పూన్ మినప్పప్పు, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకును వేసి పోపుపెట్టాలి.  దీనిని తీసుకుని గుమ్మడికాయ మిశ్రమంలో వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.

ఈ గుమ్మడికాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత దానిలో చింతపండు రసం, అర టేబుల్ స్పూన్ కారం, ఇంకా బెల్లం కూడా వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. ఇప్పుడు పాన్‌లో ఆయిల్ లో వేడి చేసి అర టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అర టీ స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ మినప్పప్పు, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకును వేసి పోపుపెట్టాలి. దీనిని తీసుకుని గుమ్మడికాయ మిశ్రమంలో వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.

5 / 5

గుమ్మడికాయ దప్పళం తినడం వలన లాభాలు:  దీనిని తినడం వలన జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇంకా శరీరానికి కావాల్సిన ఫైబర్‌ను కూడా అందిస్తుంది. పిల్లల కళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో చేసి తింటే ఆ రుచే వేరు అంత అద్భుతమైన కాంబినేషన్ ఇది

Follow Us