
నూకల పాయసం ఇలా చేస్తే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ఇంకా దీనిని పల్లెటూరి స్టైల్‌లో చేస్తే ఆ రుచే వేరబ్బా. ఇది చాలా రుచికరమైనది కూడా. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

నూకల పాయసానికి కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు బియ్యపు నూకలు, ఒక కప్పు పాలు, అర కప్పు బెల్లం, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఒక కప్పు కిస్మిస్, నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యిను రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవి పాయసానికి మంచి టెస్ట్ ను ఇస్తాయి.

నూకలను బాగా ఉడికించాలి: ముందుగా బియ్యపు నూకలను తీసుకుని వాటిలో బాగా కడిగి కనీసం గంటసేపు నానబెట్టాలి. ఇంకా ఆ తర్వాత మంచి నీటిలో బాగా ఉడికించాలి. అలాగే, నూకలు బాగా ఉడికితే పాయసం సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇది అస్సలు మర్చిపోకండి.

పాలను ఇలా కలువుకోవాలి: ఉడికిన ఈ నూకల్లో పాలు పోసి మీడియం మంటపై బాగా మరిగించాలి. ఒక గ్లాస్ పాలు, ఒక కప్పు నూకలు బాగా కలిసిపోయే వరకు వాటిని మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా చేస్తే పాయసం కూడా క్రీమీగా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా మంచిగా ఉంటుంది.

చివర్లో బెల్లం వేయాలి: వేరే గిన్నెలో బెల్లం కొంచం వేసి ఆ నీటిలో కరిగించాలి. ఈ బెల్లం పాకాన్ని పాయసంలో కూడా కలపాలి. ఇంకా కొద్దిసేపు దానిని మరిగిస్తే తీపిగా కూడా ఉంటుంది. చిన్న పాన్‌లో నెయ్య చేసి దానిలో జీడిపప్పు, కిస్మిస్ బాగా వేయించి ఈ పాయసంలో వేయాలి.