AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బలహీనతను తగ్గించి శరీరానికి ఫుల్లుగా శక్తినిస్తుంది.. మటన్‌లోని ఈ పార్ట్ సూపర్‌ స్పెషల్..

పండుగల సమయంలో మటన్ ను ఎంతో ఇష్టంగా తింటారు.. అంతేకాకుండా.. మేక రక్తంతో తయారు చేసే మటన్ నల్లాలో ప్రోటీన్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. అయితే రక్తహీనత తగ్గించడంలో, శరీరానికి బలం అందించడంలో దీని పాత్ర ఏమిటి? నల్లా తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పూర్తిగా ఉడికించి తినడం ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి.

Shaik Madar Saheb
|

Updated on: Oct 20, 2026 | 12:40 PM

Share
తెలంగాణ ప్రాచీన వంటకాలలో నాన్-వెజ్ ప్రియుల ఆహారంలో ‘నల్ల’ (మేక రక్తం) వంటకానికి విశిష్ట స్థానముంది. పండుగల సమయంలో.. అలాగే సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఆదరణ పొందే ఈ వంటకం కేవలం రుచిలోనే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలోనూ ముందంజలో ఉంటుంది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారికి ఇది అద్భుతమైన పౌష్టికాహారంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.

1 / 5
ముఖ్యమైన పోషకాలు- మటన్ నల్లా (రక్తం) లో పోషకాలు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి.. ఐరన్, ప్రోటీన్, విటమిన్ 12 తోపాటు.. ఎన్నో పోషకాలు దాగున్నాయి..  రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండి, రక్తహీనత (Anemia) సమస్యతో ఇబ్బంది పడేవారికి ఇది మేలైన ఔషధంలా సహాయపడుతుంది. ఇందులోని అధిక ప్రొటీన్ పరిమాణం కండరాల నిర్మాణానికి, రోజంతా శరీరాన్ని ఉత్సాహంగా ఉంచడానికి తోడ్పడుతుంది.

2 / 5
నీరసం, అలసట నివారణ: తరచుగా ఎదురయ్యే శారీరక బలహీనతను తగ్గించి, ఇన్స్టంట్ ఎనర్జీని అందించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రసవానంతరం మహిళల్లో కోల్పోయిన రక్తాన్ని తిరిగి సమకూర్చడానికి, బలాన్ని చేకూర్చడానికి దీనిని సాంప్రదాయకంగా ఆహారంలో భాగం చేస్తారు.

3 / 5
పాటించాల్సిన జాగ్రత్తలు: మేక రక్తాన్ని వండేటప్పుడు అత్యంత శుభ్రమైన వాతావరణంలో, పూర్తి స్థాయిలో (బాగా వేగించి/ఉడికించి) వండుకోవాలి. సగం ఉడికినది తీసుకోవడం శ్రేయస్కరం కాదు. అధిక పోషకాలు కలిగిన పదార్థం కావడం వల్ల పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది.

4 / 5
గుండె సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్ లేదా అధిక బీపీ ఉన్నవారు తమ ఆహార మార్పుల విషయంలో ముందస్తుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

5 / 5
Follow Us