
డిసెంబర్, జనవరి రాగానే చాలా మంది వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. బడ్జెట్ తక్కువగా ఉన్న వాళ్లు ఇండియాలోని ఇతర ప్రదేశాలకు వెళ్తే.. కాస్త బడ్జెట్ ఉన్న వాళ్లు ఇతర దేశాలకు వెళ్తారు. ఇలా అప్పుడప్పుడూ ఇతర ప్రేదేశాలకు వెళ్లి.. అక్కడి వాతావరణాన్ని ఆశ్వాదిస్తారు. జనవరి, డిసెంబర్‌లో ప్రేదేశాలు చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి.

అందులోనూ కేరళలో ఎటు చూసినా.. చెట్లే ఎక్కువగా ఉంటాయి. జనవరి నెల అలాంటి ప్రదేశాలకు చూడటానికి చాలా బావుంటుంది. కేరళలో బ్యాక్ వాటర్స్, హౌస్ బోట్లు చాలా ప్రసిద్ధి. చల్లటి పొగమంచు, సూర్యరశ్మి లేని చల్లని వాతావరణం విహార యాత్రకు తగినట్లు ఉంటుంది. ఎంత నడిచినా అలసట రాదు.

జనవరిలో కేళలకు వెళ్తే.. అక్కడి సంబరాలను కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. 'అట్టుకల్ పొంగల్' అనే కేరళ ప్రసిద్ధ పండుగును ఈ సమయంలోనే చేస్తారు. జనవరిలో కేరళ మరింత అందంగా కనిపిస్తుంది.

పర్యావరణ పరంగా, వన్య ప్రాణులను చూసేందుకు జనవరిలో కేరళను సందర్శించాలి. పెరియార్ జాతీయ పార్కుల అందాలు నిజంగానే మిమ్మల్ని పరవశింపజేస్తాయి. కేరళలో అనేక అందమైన కళా రూపాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా దేవర్ నాడ్‌లోని అందమైన బీచ్ కూడా ఉంది. అక్కడ మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఆనందంగా సమయాన్ని గడపవచ్చు. కోవలం, వర్కాల బీచ్‌ల ఇసుకపై కూర్చుని సూర్యాస్తమయాన్ని చూడవచ్చు.