వర్షాకాలంలో ఈ స్ట్రీట్ ఫుడ్స్ తింటే మీ ఆరోగ్యానికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు..! స్ట్రీట్ ఫుడ్ లవర్స్ కి ఇవి బెస్ట్ ఆప్షన్..!

Updated on: Jul 23, 2025 | 8:32 PM

బయట ఫుడ్ తినడం అంటే చాలా మందికి ఆరోగ్యానికి మంచిది కాదని అనిపిస్తుంది. కానీ మన దగ్గర కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ మన ఆరోగ్యానికి మేలు చేసే విధంగా కూడా ఉంటాయి. చాలా సార్లు మార్కెట్‌ కు వెళ్లినప్పుడు.. ఫ్రెండ్స్‌ తో కలిసి తిరిగేటప్పుడు నోరూరించే రుచికరమైన పదార్థాలు కనిపిస్తాయి. అయితే రుచిగా ఉందని ప్రతి ఫుడ్ మన శరీరానికి మంచిదే అనుకోవడం తప్పు. బయట తినాలంటే ముందు మనం ఏం ఆర్డర్ చేస్తున్నామో తెలుసుకోవాలి. కొద్దిగా మసాలా తగ్గించి.. తక్కువ నూనె వాడిన హెల్తీ ఫుడ్స్ మనకు దొరుకుతాయి. అలాంటి కొన్ని ఆరోగ్యకరమైన, తేలికపాటి స్ట్రీట్ ఫుడ్స్ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 8
భెల్ పూరీ.. పఫ్‌డ్ రైస్, చిన్నగా కట్ చేసిన కూరగాయలు, తీపి చట్నీ కొద్దిగా ఉల్లిపాయ కలిపి చేసే భెల్ పూరీలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మసాలాలు తగ్గించి తింటే ఆరోగ్యానికి ఇంకా మంచిది.

2 / 8
చనా చాట్.. ఉడికించిన శనగలను టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీరతో కలిపి చేసే ఈ చాట్ రుచిగా ఉండటమే కాదు.. ఇందులో ప్రోటీన్, ఫైబర్ బాగా ఉంటాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. శక్తినిచ్చే మంచి ఆప్షన్.

3 / 8
కాల్చిన మొక్కజొన్న.. తక్కువ ఉప్పుతో, నిమ్మరసం పిండుకొని తినే ఈ కాల్చిన మొక్కజొన్న మెల్లగా జీర్ణమవుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్, విటమిన్లు ఉండటం వల్ల ఇది ఒక మంచి ఆప్షన్.

4 / 8
ఆవిరి ఇడ్లీ.. ఆవిరితో ఉడికించిన ఇడ్లీ తేలికైన, నూనె లేని ఫుడ్. కాబట్టి జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా మధ్యాహ్నం చిన్న భోజనంగా తీసుకోవచ్చు.

5 / 8
లేత కొబ్బరి ముక్కలు.. కొబ్బరి నీళ్లతో పాటు దొరికే కొబ్బరి ముక్కలు శరీరానికి వెంటనే ఎనర్జీని ఇస్తాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు సహాయపడతాయి. ముఖ్యంగా వేసవిలో అలసటను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి.

6 / 8
ఫ్రూట్స్ చాట్.. రకరకాల పండ్లను (అరటి, పైనాపిల్, మామిడిపండు లాంటివి) నిమ్మరసం, మిరియాల పొడి, చాట్ మసాలాతో కలిపి చేసే ఫ్రూట్ చాట్ రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం.

7 / 8
ఉడికించిన గుడ్లు.. సులువుగా దొరికే ప్రోటీన్ రిచ్ ఫుడ్‌ గా గుడ్లను చెప్పొచ్చు. కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని తింటే ఇది శక్తినిచ్చే, ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్‌ గా ఉపయోగపడుతుంది.

8 / 8
మూంగ్ చిల్లా.. పెసరపప్పుతో చేసే చిల్లాను తక్కువ నూనెతో, తక్కువ మసాలాలతో చేస్తే ఇది ప్రోటీన్ బాగా ఉండే తేలికపాటి స్నాక్‌గా మారుతుంది. టిఫిన్‌కు లేదా సాయంత్రం స్నాక్స్‌కు మంచి ఆప్షన్. మనం ఎంచుకునే ఆహారం మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. స్ట్రీట్ ఫుడ్ అనగానే సాధారణంగా నూనెలో వేయించిన గారెలు, బజ్జీలే గుర్తుకొస్తాయి. కానీ ఇలా రుచిని కోల్పోకుండా హెల్తీగా తినే అవకాశాలు కూడా ఉన్నాయి.