నల్ల శనగలతో గుడాలు మాత్రమే కాదండోయ్.. ఇలా తిన్నారంటే అద్భుత‌మైన ఆరోగ్యం మీ సొంతం!

Updated on: Mar 05, 2026 | 12:52 PM

మన రోజువారీ ఆహారంలో పప్పుదినుసులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందులో ముఖ్యంగా నల్ల శనగలు (కల చనా) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల నల్ల శనగలను సూపర్ ఫుడ్‌గా కూడా పరిగణిస్తారు. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు అనేక రకాల వ్యాధులను దూరం చేయడంలో సహాయపడతాయి. నానబెట్టిన నల్లశనగలు రోజు ఒక వంద గ్రాములు తిన్నారంటే శక్తి పెరిగి జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కండరాలు బలంగా మారుతాయి. ఆ రోజంతా మంచి ఎనర్జీతో ఉత్సాహంగా ఉంటారు. అంతేకాదు, మీ శరీరానికి కావలసిన అన్ని రకాల ప్రోటీన్లు ఈ నల్ల శనగలలో పుష్కలంగా ఉండటం వలన అలసట రాదు. మరిన్ని లాభాలు ఇక్కడ చూద్దాం..

1 / 6
శరీరానికి కావాల్సిన పోషకాలు: నల్ల శనగల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, మాగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి కండరాల పెరుగుదలకి సహాయపడతాయి. ముఖ్యంగా శాకాహారులు ప్రోటీన్ కోసం నల్ల శనగలను ఎక్కువగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నల్ల శనగల్లో ఉన్న విటమిన్లు, ఖనిజాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీని వల్ల చిన్నపాటి ఇన్ఫెక్షన్లు, జలుబు వంటి సమస్యల నుండి రక్షణ లభిస్తుంది.

2 / 6
జీర్ణక్రియ మెరుగుపరుస్తాయి: నల్ల శనగల్లో ఉన్న ఫైబర్ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గించి జీర్ణక్రియను సక్రమంగా జరగేలా చేస్తుంది. కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

3 / 6
రక్తహీనత నివారణ: నల్ల శనగల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు నల్ల శనగలను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.

4 / 6
గుండె ఆరోగ్యం మెరుగుదల: నల్ల శనగల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

5 / 6
బరువు తగ్గడంలో సహాయం: నల్ల శనగల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయదు. దీంతో అధికంగా తినే అలవాటు తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది. అందుకే డైట్ ఫాలో అయ్యే వారు నల్ల శనగలను తమ ఆహారంలో చేర్చుకుంటారు.

6 / 6
నల్ల శనగలను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే కూరలు, సలాడ్లు, స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా వీటిని ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. పోషకాలు సమృద్ధిగా ఉన్న నల్ల శనగలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఆహారం. రోజూ పరిమిత మోతాదులో వీటిని తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడి, గుండె ఆరోగ్యం బాగుండి, శరీరానికి శక్తి లభిస్తుంది. అందుకే నల్ల శనగలను ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us