
అర్గో గేడే రైలు రైలు మార్గం, ఇండోనేషియా: ఈ రైలు మార్గం జకార్తా నుంచి బాండుంగ్ వరకు నడుస్తుంది. సికురుతుగ్ పైలాన్ ట్రెస్టల్ వంతెన మీదుగా వెళుతుంది. ఇది క్రింద ఉన్న లోతైన ఉపఉష్ణమండల లోయ ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తుంది. వంతెన కంచె లేకుండా ఉండటం వలన ఇది సురక్షితం కాకపోయినప్పటికీ, సుందరమైన దాని దృశ్యాలు చూపర్లను ఆకట్టుకుంటాయి.

అసో మినామి రూట్, జపాన్: ఈ రైలు ప్రయాణం మిమ్మల్ని జపాన్‌లోని అత్యంత చురుకైన అగ్నిపర్వత ప్రాంతం గుండా తీసుకెళుతుంది, అక్కడ మీరు లావాతో కాలిపోయిన అడవులను చూడవచ్చు. పేలుడు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతం గుండా స్వారీ చేయడంలో థ్రిల్‌ను అనుభవించవచ్చు. ఇది చాలా డేంజరస్ జర్నీ అనే చెప్పాలి.

ది డెత్ రైల్వే, థాయిలాండ్: ఈ రైల్వే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నిర్మించబడింది. దాని నిర్మాణ సమయంలో అధిక సంఖ్యలో ప్రాణనష్టానికి ప్రసిద్ధి చెందింది. ఈ రైలు దట్టమైన అటవీ ప్రాంతం గుండా వెళుతుంది. క్వాయ్ నదిపై ఉన్న ఐకానిక్ వంతెనను దాటుతుంది. ఇది లోతైన లోయ ఉన్న కొండకి అనుకోని కంచె లేకుండా ఉండే భయంకరమైన ట్రైన్ రూట్.

డెవిల్స్ నోస్ ట్రైన్, ఈక్వెడార్: ఆండీస్ పర్వతాలలో ఉన్న ఈ రైలు మార్గం. నిటారుగా ఉన్న కొండల ఎక్కడం, హెయిర్‌పిన్ వంపులకు ప్రసిద్ధి చెందింది. థ్రిల్ కోరుకునేవారు పర్వత వాలులకు అతుక్కుపోయే పాత బాక్స్‌కార్లలో ప్రయాణించవచ్చు. ఈ జర్నీ అద్భుతంగా ఉన్నప్పటికీ గుండె దైర్యం లేనివారు ఈ జర్నీ చేయకపోవడమే మంచిది.

చెన్నై-రామేశ్వరం మార్గం, భారతదేశం: ఈ రైలు మార్గం సముద్రంపై ఉన్న కాంటిలివర్ వంతెన అయిన పంబన్ వంతెన మీదుగా వెళుతుంది. ఇది దిగువన సముద్రం అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. 2 కిలోమీటర్ల పొడవైన వంతెన భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపానికి కలుపుతుంది. ఈ జర్నీ చాలా బాగుంటుంది. అలాగే కాస్త డేంజర్ కూడా.