
వర్షాకాలంలో సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, చేతులు తరచుగా కడుక్కోవడం, కళ్ళు తుడుచుకోవడానికి శుభ్రమైన వస్త్రం ఉపయోగించడం ముఖ్యం. ఈ కాలంలో కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కళ్ళు దురదగా అనిపిస్తే లేదా ఎర్రగా మారితే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

కంటి చుక్కల మందులు లేదా ఇతర కంటి సంబంధిత మందులను వాడే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం చాలా ముఖ్యం. కంటి అలంకరణ వస్తువులను ఇతరులతో పంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, మీ కంటి అలంకరణ వస్తువులను ఎవరితోనూ పంచుకోవద్దు.

కళ్ళజోడు లేదా కాంటాక్ట్ లెన్స్‌లను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. లందంటే వర్షం కారణం వాటిపై సూక్షమక్రిములు చేరి కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. కుదిరితే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నప్పుడు చేతులకు గౌజులు వాడటం మంచిది.

కళ్లపై భారంగా ఉన్నట్లయితే ఓ గుడ్డను గోరువెచ్చని నీటిలో ముంచి కాళ్లపై మెల్లగా మసాజ్ చెయ్యండి. ఇలా చేస్తున్నప్పుడు కళ్లు మూసుకుని ఉండేలా చూసుకోండి. దీనితో పాటు, మీరు కళ్లలో పొడిబారినట్లు అనిపిస్తే, వాటిని రిఫ్రెష్ చేయడానికి డాక్టర్ సలహా మేరకు కళ్లలో రోజ్ వాటర్ లేదా ఐ డ్రాప్స్ ఉపయోగించవచ్చు.

కంటికి సంబంధించిన ఏవైనా సమస్యలు వస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. లేదంటే ఇవి తీవ్రమై కంటి చూపుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే సమస్యను ముందే గుర్తించి చికిత్స తీసుకొని జాగ్రత్త పడటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.