
బేరిపండ్లుగా ప్రసిద్ధి చెందిన పియర్స్‌లో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, ఫోలేట్, ఫైబర్, మెగ్నిషియం, ఫినొలిక్ సమ్మేళనాలు, విటమిన్ ఇ, సి, కె, ఎ వంటి పోషకాలు ఉంటాయి.

Bకాల్షియం, ఫాస్పరస్ ఉన్నందున బేరిపండ్లు మన శరీరంలోని ఎముకలను పటిష్టం చేస్తాయి. ఇంకా బోలు ఎముకల సమస్యలను నివారిస్తాయి. ones

ఐరన్ సమృద్ధిగా ఉన్నందున పియర్స్ హిమోగ్లోబిన్ లోపం సమస్యను నివారించడంతో పాటు రక్తహీనతకు స్వస్తి పలుకుతాయి. ఈ కారణంగానే బాలింతలు బేరిపండ్లను తీసుకోవడం చాలా మంచిది.

ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను కలిగిన పియర్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గేలా చేస్తాయి. షుగర్ లెవెల్స్‌ను కూడా నియంత్రించగలవు.

పియర్స్ పండ్లలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఫలితంగా సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.