Summer Eye Care: మండే ఎండలో జాగ్రత్త.. మీ కళ్లు జర భద్రం..

|

Apr 26, 2024 | 9:38 PM

ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతకు ప్రజలతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హీట్‌ స్ట్రోక్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వేడిలో శరీరంతో పాటు కళ్లపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు ఈ వేడి ఎండలో బయటకు వెళ్ళిన వెంటనే.. మీ కళ్ళకు కాస్త అసౌకర్యం కలుగుతుంది. ఎండ ప్రభావంతో కళ్ళు ఎర్రగా మారుతాయి. 

1 / 5
 ఈ వేసవిలో కళ్లపై జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. అంధత్వం, క్యాన్సర్ ప్రమాదం వంటివి వచ్చే అవకాశముంది. కాబట్టి ఈ పరిస్థితిలో మీ కళ్లను ఎలా చూసుకోవాలో చూడండి.

2 / 5
సన్ గ్లాసెస్ ఇప్పుడు ఫ్యాషన్ అని అనుకోకండి.. ఈ వేసవిలో అవి తప్పనిసరిగా ధరించాలి. ఎండలో ఉన్నప్పుడు సన్ గ్లాసెస్, టోపీ, వాటర్ బాటిల్ లాంటివి వెంట ఉంచుకోవడం ముఖ్యం అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. సన్ గ్లాసెస్ UVA - UVB రెండు రకాల కిరణాల నుండి మీ కళ్ళను రక్షిస్తాయి.

3 / 5
ఎవరైనా కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగిస్తుంటే, దీని గురించి కూడా తెలుసుకోండి. మీ చేతులు కడుక్కోని కాంటాక్ట్ లెన్సులు ధరించండి. ఇది సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీరు కాంటాక్ట్ లెన్సులు ధరించినా సన్ గ్లాసెస్ ఉపయోగించవచ్చు.

4 / 5
వేడి వాతావరణంలో ఆరోగ్యంగా ఉండటానికి హైడ్రేషన్‌గా ఉండటం చాలా ముఖ్యం. శరీరంలో డీహైడ్రేషన్ సమస్య వచ్చినప్పుడు కళ్ళు పొడిగా మారుతాయి. కళ్ళ మంట, చికాకు, ఎర్రగా మారడం లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం మూడు లీటర్ల నీరు తాగండి.

5 / 5
     పిల్లల కంటి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. సన్ గ్లాసెస్ ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఎండల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్ గ్లాసెస్, తలపై టోపీని ధరించాలి.