Tiger Nuts Benefits: టైగర్ నట్స్ ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు.. బాదం, జీడిపప్పును మించి లాభాలు..!

|

Sep 11, 2024 | 3:34 PM

టైగర్ నట్స్ అనేవి చిన్నగా గుండ్రని ఆకారంలో ఉండే ఒక ఫ్రూట్‌. ఇది చూసేందుకు కొంచెం బాదంలా కనిపిస్తుంది. వీటిని సాధారణంగా పశ్చిమ ఆఫ్రికాలో పండిస్తారు. ఇవి తీపిగా, కొంచెం గింజల వాసనతో ఉంటాయి. టైగర్ నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి గురించి చాలా మందికి తెలియదు. వీటిలో ఉండే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1 / 5
జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్ నట్స్ ఇవి మాత్రమే తెలుసు. కానీ ఈ టైగర్ నట్స్ గురించి చాలా మందికి తెలియదు. ఇందులో మిగతా వాటికంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. టైగర్ నట్స్ లో ఫైబర్, విటమిన్ ఇ, మినరల్స్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఇందులోని ఫైబర్ మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

2 / 5
ఈ గింజలను డైట్లో చేర్చుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణం కానీ ఆహారాన్ని సైతం జీర్ణం చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు పొట్ట నిండిన అనుభూతి కలిగిస్తాయి. దీంతో బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

3 / 5
చక్కెర స్థాయిలను నియంత్రించటంలోనూ టైగర్‌ నట్స్ ఉపయోగపడతాయి. ఈ గింజల్లో ఉండే ఫైబర్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. ఫైబర్ పెద్ద ప్రేగులో చక్కెర శోషణను అడ్డుకుంటుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది.

4 / 5
టైగర్ గింజల్లో 18 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. గుడ్డుకు సమానంగా ప్రొటీన్ ఉంటుంది. వీటిని తింటే ఎముకలు బలంగా ఉంటాయి. వీటిని తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. టైగర్ నట్స్ లో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.

5 / 5
ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. టైగర్ నట్స్ లోని మోనో శాచురేటెడ్ కొవ్వు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. ఇవి కణాల ఆరోగ్యానికి సహాయపడతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.