
సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంటాయి. కొన్ని చూడగానే వావ్ అని అనిపిస్తాయి. ఇక్కడ ఓ యువతి వేసిన ఆర్ట్ అందరిని అకట్టుకుంటుంది. మరి, లేట్ చేయకుండా మీరు కూడా ఈ ఫోటోలను చూసేయండి.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడలో ఆకుపై మహావిష్ణువు ప్రతిరూపం చిత్రాన్ని రూపకల్పన చేశారు ఇదే గ్రామానికి చెందిన బద్దిరాజు లక్ష్మి సుప్రజా పార్వతి. ఏకాదశి రోజు రావి ఆకుపై ఓ యువతో విష్ణుమూర్తి చిత్రాన్ని రూపొందించింది

తొలి ఏకాదశిని అనపర్తి మండలంలో పురస్కరించుకుని మహేంద్రవాడకు చెందిన బద్ధిర్రాజు లక్ష్మీ సుప్రజా పార్వతి అనే డిగ్రీ విద్యార్థిని రావి ఆకుపై రూపొందించిన విష్ణుమూర్తి రూపం ఆకట్టుకుంది. తొలి ఏకాదశి రోజు శంకు చక్రాలు ఆదిశేషుని అడగనీడలో స్వామివారిని తీర్చిదిద్దారు పార్వతి.

మహేంద్రవాడ గ్రామానికి చెందిన ఒక మోటారు వాహన రిపేర్ల శ్రీధర్ కుమార్తె ఇంత చక్కటి ఆర్ట్ ద్వారా అందరిని ఆకట్టుకోవడం విశేషం. దీంతోపాటు వాల్ పేపర్ పెయింటింగ్ 3d అవుట్ లైన్ ఆర్ట్ స్ప్రింగ్ ఆర్ట్ మైక్రో ఇలా వివిధ రకాల పెయింటింగ్ రూపొందిస్తున్నట్లు పార్వతి తెలిపారు.

ఆమె ఇప్పటికే ఎన్నో విలువైన బహుమతులు పోటీల్లో గెలుచుకున్నారు. నేషనల్ ఇంటర్నేషనల్ నోబెల్ లో అనేక బహుమతులు గెలుచుకోగా ఇంకా అనేక చిత్రాలు భవిష్యత్తులో రూపొందించేందుకు కార్యచరణ ఉందని పార్వతి వివరణ ఇచ్చారు.