Yogurt Honey Face Pack: పుల్లటి పెరుగులో తేనె కలిపి ముఖానికి అప్లై చేశారంటే.. మీ కళ్లను మీరే నమ్మలేరు!

|

Dec 31, 2023 | 12:16 PM

ముఖం సహజమైన కాంతిని పొందాలంటే సహజ పదార్థాలు మాత్రమే ఉపయోగపడతాయి. నేటికాలంలో చాలా మంది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సౌందర్య సాధనాలతో పాటు బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. శీతాకాలంలో పొడి వాతావరణం వల్ల పాడైనా చర్మానికి చికిత్స అందించడానికి పుల్లటి పెరుగు సహాయపడుతుంది. పుల్లటి పెరుగు చర్మ తేమను కాపాడుకోవడంలో చాలా మేలు చేస్తుంది. పుల్లటి పెరుగు మొటిమల నుంచి మచ్చల వరకు నివారిస్తుంది. పుల్లటి పెరుగును రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది..

1 / 5
Yogurt - పెరుగు, ఇతర పులియబెట్టిన ఆహారాలలో లభించే ప్రోబయోటిక్స్ గట్ బ్యాక్టీరియా ఆరోగ్యకరమైన సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

2 / 5
పుల్లటి పెరుగును నేరుగా చర్మంపై అప్లై చేయవచ్చు. లేదంటే పుల్లటి పెరుగులో ఒక స్పూన్‌ తేనే కలుపుకుని ఫేస్‌ ప్యాక్‌ వేసుకోవచ్చు. ఈ ప్యాక్‌ తక్షణమే చర్మ కాంతిని పునరుద్ధరిస్తుంది. పుల్లటి పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. మరోవైపు, తేనెలో హ్యూమెక్టెంట్లు ఉంటాయి. ఈ రెండు పదార్థాలు చర్మంపై సహజ మాయిశ్చరైజర్లుగా పనిచేస్తాయి. అలాగే పుల్లటి పెరుగు, తేనె చర్మానికి సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌లుగా పనిచేస్తాయి.

3 / 5
ఈ ఫేస్‌ ప్యాక్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలు, దద్దుర్లు, దురద, చికాకు వంటి సమస్యలను దూరం చేస్తాయి. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..

4 / 5
రెండు స్పూన్ల పుల్లటి పెరుగులో ఒక స్పూన్‌ తేనెను కలిపి ఫేస్ ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు. ముందుగా ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఈ ఫేస్ ప్యాక్‌ని చర్మంపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడగాలి.

5 / 5
ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల చర్మాన్ని వృద్ధాప్యం ఛాయల నుండి కాపాడుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ చర్మ గాయాలను నయం చేయడానికి కూడా సహాయపడుతుంది.