యాపిల్ సైడర్ వెనిగర్- యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పిగ్మెంట్, డార్క్ స్పాట్‌లను తొలగించడానికి సహాయపడుతుంది. ఒక గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగర్, నీటిని సమాన పరిమాణంలో వేసి కలపాలి. ఆ తరువాత మిశ్రామాన్ని ముఖానికి అప్లై చేయాలి. దీంతో ముఖంపై నల్లటి వలయాలు తగ్గుతాయి.
అలోవెరా - అలోవెరా చర్మంపై నల్లటి మచ్చలను తగ్గించి కాంతివంతంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇది పిగ్మెంటేషన్ చికిత్సకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు కలబందను చర్మానికి పట్టించి ఉదయం చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే.. ఫేస్ నిగారింపుగా మారుతుంది.
గ్రీన్ టీ - గ్రీన్ టీ మీ చర్మానికి మంచిది. గ్రీన్ టీ నీటిని ముఖం అప్లై చేసి.. అర్ధగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇది నల్ల మచ్చలు, మొటిమలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.
బంగాళదుంప - డార్క్ స్పాట్‌లను తగ్గించడానికి మీరు బంగాళదుంపలను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం బంగాళాదుంపలను కట్ చేసి నల్ల మచ్చలపై ఉంచాలి. అలా కొన్ని నిమిషాలు ఉంచి.. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే నల్లమచ్చలు తగ్గుతాయి. (గమనిక: మచ్చలు, మొటిమలు ఎక్కువగా ఉంటే.. వైద్యుడిని సంప్రదించడం మంచిది.)