
చాల మంది సంఖ్యాశాస్త్రం, జాతకం ఆధారంగా తమ వ్యక్తిత్వం, భవిష్యత్తు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ కొన్ని సార్లు ఆప్టికల్ ఇల్యూషన్స్ కూడా మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయంట. ఆప్టికల్ భ్రమలు వ్యక్తిత్వ పరీక్షల్లో కీలక పాత్రోపోషిస్తాయి. సైకాలజికల్ ప్రకారం, రూపొందించిన ఈ చిత్రాల ద్వారా మీ వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు.

పైన మీకు ఓ చిత్రం కనిపిస్తుంది కదా. అది మొత్తం ఒక అందమైన పెయింటింగ్‌లా కనిపిస్తుంది. అయితే ఆ చిత్రంలో చాలా రంగులు ఉన్నాయి. ముఖ్యంగా నీలం, పసుపు, గోధుమ, ఆకుపచ్చ ఇలా చాలా రంగులు కనిపిస్తున్నాయి. అయితే మీకు మొదటగా ఏ రంగు ఎక్కువగా కనిపిస్తుందో అదే మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందంట.

బ్లూ కలర్ : మొదట మీకు గనుక నీలం రంగు, (బ్లూకలర్ ) కనిపిస్తుందో మీరు చాలా మంచి దృష్టినైపుణ్యం కలవారు. మీరు అనుకున్నది సాధించుకోగలిగే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఎక్కువగా కెరీర్ పై ఫోకస్ పెడుతారు. కుటుంబానికి దూరంగా ఉండి, మీ కెరీర్, భవిష్యత్తు కోసం ఎక్కువగా కష్టపడుతుంటారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం ఇష్టపడుతారు.

ఆకుపచ్చ రంగు : ఎవరికైతే మొదట ఆకుపచ్చ రంగు కనిపిస్తుందో వారు చాలా ముందు చూపు కలవారు. వీరిది భావోద్వేగమైన మనసు, ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవుతారు. మీ గురించి మాత్రమే కాకుండా, మీ చుట్టూ ఉన్నవారితో కూడా చాలా బాగుంటారు. వారి కోసం ఏం చేయడానికి అయినా సిద్ధ పడతారు. మీ నిర్ణయాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. పెద్దల పట్ల చాలా గౌరవంగా ఉంటారు.

పసుపు రంగు : పైన ఫొటో చూడగానే మొదట ఎవరికి అయితే పసుపు రంగు కనిపిస్తుందో వారు చాలా తెలివైనవారు. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా సరే , మీ తెలివితోటి సమస్యలను పరిష్కరించుకునే నేర్పు కలిగి ఉంటారు. వీరు విద్యలో ఉన్నతంగా రాణిస్తారు. స్నేహితులతో ఎక్కువ సేపు గడపడానికి ఇష్టపడతారు.