పిల్లలకు ఆరోగ్యాన్నిచ్చే డ్రైఫ్రూట్ లడ్డు.. ఇది ఎలా తయారు చేయాలంటే?

Updated on: Jul 25, 2025 | 9:31 PM

పిల్లలు ఎప్పుడూ స్వీట్ తినడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అయితే వారికి మంచి రుచిని ఇవ్వడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడానికి మంచి ఆహారం పెట్టాలంటారు. దానికి సరైన ఎంపికంటే డ్రై ఫ్రూట్ లడ్డూనే, ఇందులో చక్కెర కి బదులు ఖర్జూర ఉపయోగిస్తారు.

1 / 5
పిల్లలు ఎప్పుడూ స్వీట్ తినడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అయితే వారికి మంచి రుచిని ఇవ్వడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడానికి మంచి ఆహారం పెట్టాలంటారు. దానికి సరైన ఎంపికంటే డ్రై ఫ్రూట్ లడ్డూనే, ఇందులో చక్కెర కి బదులు ఖర్జూర ఉపయోగిస్తారు. అంతే కాకుండా డ్రైఫ్రూట్స్ కూడా ఉంటాయి. దీని వలన ఇది పిల్లలకు పెట్టడానికి చాలా మంచిది. కాగా, ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్ లడ్డూ ఎలా తయారు చేయాలో చూద్దాం.

2 / 5
కావాల్సిన పదార్థాలు : ఖర్జూరం - 1 కప్పు, అంజీర్ అరకప్పు, జీడిపప్పు పావు కప్పు, బాదం పావు కప్పు, వాల్ నట్స్ పావు కప్పు, పిస్తా పప్పులు రెండు టేబుల్ స్పూన్స్, ఎండు ద్రాక్ష 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పుచ్చకాయ గింజలు ఒ టీస్పూన్, యాలకుల పొడి, అరటీస్పూన్.

3 / 5
తయారీ విధానం : ముందుగా బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, పిస్తాపప్పులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత అంజీర్‌ను వేడి నీటిలో పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టాలి. తర్వాత వీటిని, అలాగే ఖర్జూరాలను ముక్కలుగా చేసి మిక్సీ పట్టాలి. ఈ పేస్టు లడ్డూ చేయడానికి బాగుంటుంది. తర్వాత ఒక పాన్ తీసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దాన్ని కాస్త వేడి చెయ్యాలి.

4 / 5
నెయ్యి వేడి అయిన తర్వాత అందులో తరిగిన డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిప్పు, పిస్తా, వాల్ నట్స్ అన్నింటిని వేసుకొని వేయించుకోవాలి. అవి లేత గోధు రంగు వచ్చాక, అందులోనే ఎండు ద్రాక్ష, అంజీర పండ్లను వేసి వేయించుకోవాలి. తర్వాత వీటిలోకి ఖర్జూర పేస్ట్ వేసి తక్కువ మంటపై మెత్తగా కలుపుకోవాలి.

5 / 5
ఖర్జూర పేస్ట్, డ్రైఫ్రూట్స్ అన్నీ కలిసేలా చూసుకోవాలి. తర్వాత వీటిలోకి యాలకుల పొడి, పుచ్చకాయ విత్తనాలు వేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి, ఈ డ్రైఫ్రూట్ లడ్డూ మిశ్రమం చల్లబడేలా చూడాలి. అది కాస్త గోరు వెచ్చగా ఉన్న సమయంలో చిన్న చిన్నగా లడ్డూలు చేసుకోవాలి అంతే, వేడి వేడి డ్రైఫ్రూట్ లడ్డూ రెడీ.