
థైరాయిడ్ అనేది రెండు రకాలు : హైపోథైరాయిడిజం, తక్కువ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. హైపర్ థైరాయిడిజం. ఇది ఎక్కువ హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సమస్య పరుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది.కాగా, దీనికి గల ముఖ్య కారణాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

మహిళల్లో థైరాయిడ్ సమస్యల కు ముఖ్య కారణం ఆటో ఇమ్యూన్ వ్యాధులు. ఒకటి హషిమోటోస్ థైరాయిడిటిస్, గ్రేవ్స్ వ్యాధి. ఈ రెండు రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంథిని హర్మోన్ల ఉత్పత్తి తగ్గించడం , పెంచడం వలన థైరాయిడ్ సమస్య అనేది వస్తుందంట.

ఇక ఇదే కాకుండా ప్రెగ్నెంట్ సమయంలో కూడా చాలా మంది థైరాయిడ్ సమస్య బారిన పడతారు. హర్మోన్లలో మార్పుల వలన థైరాయిడ్ సమస్య వస్తుంది. అయితే ఇది కొందరిలో కొన్ని నెలల వరకే ఉండి తగ్గిపోతుంది. కానీ కొంత మందిలో మాత్రం శాశ్వతంగా ఉండిపోతుందంట.

అలాగే, అయోడిన్ లోపం లే దా అయోడిన్ అధికంగా ఉండటం వలన కూడా థైరాయిడ్ సమస్య వస్తుందంట. కొంత మందిలో దీర్ఘకాలిక ఒత్తిడి థైరాయిడ్ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే కాకుండా కొన్నిరకాల మందులు కూడా థైరాయిడ్ పనితీరును ప్రభావితం చేస్తాయంట.

ఇవే కాకుండా యవ్వనం, మోనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పుల వలన కూడా థైరాయిడ్ సమస్య రావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. (నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు)