మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

Edited By:

Updated on: Jan 18, 2026 | 9:55 PM

పూరీలు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చాలా మంది ఎంతో ఇష్టంగా పూరీలు తింటారు. ఇక కొంత మంది గోధుమ పిండితో పూరీలు చేస్తే, మరికొందరు మైదా పిండితో చేస్తుంటారు. అయితే ఇవేవి కాకుండా, బియ్యంపిండితో ఇలా పూరీలు చేస్తే, అదిరిపోతాయంట. మెత్త మెత్తగా తిన్నా కొద్ది తినాలనిపిస్తుందంట. మరి అది ఎలాగో చూసేద్దాం పదండి.

1 / 5
కావాల్సిన పదార్థాలు : బియ్యం పిండి, పసుపు, నువ్వులు, రుచికిసరిపడ ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడ నూనె, అలాగే వేడి నీరు.

2 / 5
తయారీ విధానం : ముందుగా గ్యాస్ ఆన్ చేసి, స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి , ఆ నీరు మరిగేలా చూడాలి. తర్వాత అందులో కొన్ని నువ్వులు, పసుపు, ఉప్పు వేసి, మరో 5 నిమిషాలు మరగనివ్వాలి.నీరు మంచిగా మరిగి, పొంగులా వస్తున్న క్రమంలో, మరిగే నీటిలో బియ్యం పిండిని, ఈ మరిగే నీటిలో వేసుకొని, తక్కువ మంట మీద ఉడికించాలి. ముఖ్యంగా నీటిలో పిండి వేసిన తర్వాత దానిని మంచిగా కలుపుకోవాలి. ఇలా చేయడం వలన పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది.

3 / 5
దీని తర్వాత, పిండి బాగా కలిపి, ఉడికినట్లు అనిపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, కాసేపు పక్కన పెట్టుకోవాలి.  పిండి చల్లారేలా చూసుకోవాలి. దీనిని ఫ్యాన్ కింద పెట్టడం, ఎండలో పెట్టడం చేయకూడదు. ఇలా చేసిన తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, పక్కన పెట్టుకోవాలి.

4 / 5
తర్వాత ఉండలను ఒక్కో ముద్దను తీసుకొని, పూరీల మాదిరి చేసుకోవాలి. ఇలా వెంట వెంటనే పూరీలు చేసుకుంటూ, ఉండాలి. అలాగే మరో వైపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, దానిలో డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేసుకోవాలి.

5 / 5
నూనె వేడి అయిన తర్వాత అందులో పూరీలు వేసి వేయించుకోవాలి. రెండు వైపులా మంచిగా కాలేలా చూసుకోవాలి. లేత గోధుమ రంగు వచ్చే వరకు కాల్చుకోవడం వలన టేస్ట్ అదిరిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ, వేడి వేడీ బియ్యం పిండి పూరీలు రెడీ.