
నాటు కోడి కూర ఇష్టపడని వారు ఎవరుంటారు. ఇక తెలంగాణ స్టైల్‌లో నాటుకోడి కూర వండితే, ఆ టేస్ట్ గురించి చెప్పడానికి మాటలు కూడా సరిపోవు. అంత అద్భుతంగా ఉంటుంది. అన్నంలో కానీ, చపాతీలతో కానీ తింటే, అదిరిపోతుంది. మరీ ఈ నాటు కోడి కూర పులుసు మీరు కూడా వండాలి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన చిట్కాలు. దీని ద్వారా, చాలా త్వరగా వండెయ్యండి మరి!

కావాల్సిన పదార్థాలు : నాటు కోడి కేజీ, ధనియాల పొడి, ఘోరం మసాలా, చిటికెడు పసుపు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి, టమాటాలు రెండు, బిర్యానీ ఆకులు, లవంగాలు, కొబ్బరి పొడి, కొత్తిమీర, పూదీనా వీలైతే నాలుగు కరివేపాకు రెబ్బలు, ఒక నిమ్మకాయ.

తయారీ విధానం : ముందుగా చికెన్ తీసుకొని పసుపు, నిమ్మకాయ రసం వేసి శుభ్రంగా కడగాలి. తర్వాత అందులోనీటి చుక్కలేకుండా చేసి, కారం, ఉప్పు, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, అందులో చికెన్ కర్రీ వండుకోవడానికి సరిపడ నూనె పోసుకోవాలి. తర్వాత అందులో బిర్యానీ ఆకులు, కరివేపాకు రెబ్బలు , ఉల్లిపాయ ముక్కలు , పచ్చి మిర్చీ వేసి మంచిగా కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు కలుపుకోవాలి.

ఇప్పుడు అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న నాటుకోడి చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కర్రీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నీరు పోస్తూ ఉడికించుకోవాలి. మంచిగా ఉడికి పుసులు చిక్కబడుతుంది. ఇప్పుడు ఘరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసి మంచిగా దాదాపు 20 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ తెలంగాణ స్టైల్ నాటుకోడి పులుసు రెడీ.