
కన్యా రాశి: సెప్టెంబర్ నెలలో కన్య రాశి వారు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నదంట. అంతే కాకుండా ఈ రాశి వారు ఈ నెలలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటారు. ఎందుకంటే? ఈ నెలలో ఖర్చులు ఆదాయాన్ని మిచిపోతాయని, అందుకే అప్పలు పెరగడం ఇతరుల వద్ద ఎక్కువగా అప్పులు చేయడం జరుగుతుందంట.

మకర రాశి: మకర రాశి వారికి సెప్టెంబర్ నెల చాలా కష్టకాల సమయం అని చెప్పాలి. ఈ రాశుల వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వ్యాపారవేత్తలు అస్సలే తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదంట. లేకపోతే ఇవి లాభాలు పొందే ఛాన్స్ తక్కువ ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

మిథున రాశి : ఈ రాశి వారికి సెప్టెంబర్ నెల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. శత్రువులు మీపై కుట్రలు పన్నవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. మీరు ఉద్యోగం చేసే చోట కూడా సమస్యలు అధికం అవుతాయి. అలాగే మీ తోబుట్టువులకు మీకు బంధం బలహీనపడవచ్చును, చికాకులు అధికం అవుతాయి.

సింహ రాశి : సింహ రాశి వారు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అధికంగా డబ్బు ఖర్చు కావడం అనేక సమస్యలను సృష్టిస్తుంది. కుటుంబంలో కూడా కలహాలు ఎక్కవ అవుతాయి. అందుకే మీరు అనవసరమైన విషయాల్లో తల దూర్చకపోవడమే ఉత్తమం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కానీ కొన్ని చికాకులు మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టి వేస్తాయి.

విద్యార్థులకు ఇది చాలా కష్టాల సమయం. అలాగే వ్యాపారస్తులు, రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా అనేక ఇబ్బందులు చవి చూడాల్సి వస్తుంది. అలాగే ఈ రాశి వారు ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే వాగ్వాదం జరిగే ఛాన్స్ ఉంటుందంట.