
చలి కాలంలో కూడా ఈగల బెడద ఎక్కువగానే ఉంటుంది. ఎంత శుభ్రత పాటించినా ఇవి వస్తూనే ఉంటాయి. ఈగలు కూడా రోగాలను మోసుకొస్తూ ఉంటాయి. ఈగలు ఆహార పదార్థాలపై వాలడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈగలు ఇంట్లోకి రానివ్వకుండా ఉంచేందుకు ఇప్పటికే ఎన్నో రకాల చిట్కాలు చూశాం. లేటెస్ట్‌గా మీ కోసం.. ఇంట్లో ఉండే వాటితోనే ఈగలను ఎలా బయటకు తరిమి కొట్టవచ్చో ఇప్పుడు చూసేయండి.

ఉప్పు నీటిని ఉపయోగించడం వల్ల కూడా ఈగలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఉప్పు నీటిని ఒక స్ప్రే బాటిల్‌లో వేయాలి. ఈ నీటిని ఇంటి నలుమూలల్లో స్ప్రే చేయడం వల్ల ఈగలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

పుదీనా మొక్కలను ఇంట్లో పెంచుకున్నా, ఇంటి ఆవరణలో పెంచుకున్నా ఈగలు, దోమలు రావు. పుదీనా ఆకుల్ని నీటిలో మరిగించి ఆ నీటిని స్ప్రే చేసినా కూడా ఈ వాసనకు ఈగలు రాకుండా ఉంటాయి. పుదీనా ఆయిల్ కూడా ఉపయోగించవచ్చు.

అదే విధంగా నిమ్మకాయ, లవంగాలతో కూడా ఈగలు ఇంట్లోకి రానివ్వకుండా చేయవచ్చు. నిమ్మకాయ బద్దను సగానికి కోసి దానిపై లవంగాల పొడిని చల్లి డోర్ దగ్గర, కిటీకీ వద్ద ఉంచండి. ఈ వాసనకు కూడా ఈగలు, దోమలు కూడా రాకుండా ఉంటాయి.