వామ్మో.. మీ ఫ్రిడ్జ్‌లో వీటిని నిల్వ చేసి తింటున్నారా..? షెడ్డుకు గ్యారెంటీగా పోతారంట..

|

Aug 06, 2024 | 4:01 PM

ప్రస్తుత కాలంలో రిఫ్రిజిరేటర్‌ల వాడకం సర్వసాధారణమైంది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా దాదాపు అందరి ఇళ్లలో ఫ్రిజ్‌లు అందుబాటులో ఉన్నాయి. వండిన ఆహార పదార్థాలు పాడవ్వకుండా, కూరగాయలు, ఇతర పదార్థాలు ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండేందుకు ఫ్రిజ్‌ను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు వండిన లేదా పచ్చి కూరగాయలను నిల్వ చేయడానికి ఉపయోగించే ఫ్రిజ్‌లలో ..

1 / 7
ప్రస్తుత కాలంలో రిఫ్రిజిరేటర్‌ల వాడకం సర్వసాధారణమైంది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా దాదాపు అందరి ఇళ్లలో ఫ్రిజ్‌లు అందుబాటులో ఉన్నాయి. వండిన ఆహార పదార్థాలు పాడవ్వకుండా, కూరగాయలు, ఇతర పదార్థాలు ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండేందుకు ఫ్రిజ్‌ను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు వండిన లేదా పచ్చి కూరగాయలను నిల్వ చేయడానికి ఉపయోగించే ఫ్రిజ్‌లలో .. ఇప్పుడు మనకు దొరికిన పదార్థాలన్నింటిని వాటిలోనే ఉంచుతున్నాం.. పండ్ల నుంచి మసాలా దినుసుల వరకు.. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఉంచుతాం.. అయితే.. కొన్ని పదార్థాలను మాత్రం ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఆహారాలను ఫ్రిజ్‌లో ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకోండి..

2 / 7
వెల్లుల్లి - ఉల్లిపాయలు: వెల్లుల్లిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల అది మొలకెత్తుతుంది. ఇంకా ఒలిచిన వెల్లుల్లిని ఉంచితే అది పాడైపోయి దాని రుచి మారుతుంది. దానిలోని ఔషధ గుణాలు కోల్పోయి.. బూజు పడుతుంది.  ఉల్లిపాయాలను కూడా ఫ్రిజ్ లో ఉంచకూడదు.. ఫ్రిజ్‌లో కట్ చేసిన ఉల్లిపాయను ఉంచితే.. దానిలోని పిండి పదార్ధం చక్కెరగా మారుతుంది. అంతేకాకుండా రుచి మారి బూజు పడుతుంది. అందుకే.. వెల్లుల్లి, ఉల్లిపాయను అప్పటికప్పుడు వాడటం మంచిది.

3 / 7
బంగాళదుంపలు: భారతీయ వంటశాలలలో బంగాళాదుంపలను ఎల్లప్పుడూ ఉపయోగిస్తారు. బంగాళాదుంపలను చల్లటి ప్రదేశంలో ఉంచడం వల్ల అందులో చెక్కర శాతం ఎక్కువగా పెరిగి.. రుచి మారిపోతుంది.

4 / 7
మసాలా దినుసులు :  మొత్తం మసాలాలు కూడా రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు. వాటిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి రుచి, వాసన, లక్షణాలను ప్రభావితం చేస్తుంది. మొత్తం సుగంధ ద్రవ్యాలు రిఫ్రిజిరేటర్ నుంచి తేమను గ్రహిస్తాయి. ఇది వాటి సహజ రుచిని పాడు చేస్తాయి. అందుకే అల్లం కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదంటున్నారు..

5 / 7
డ్రై ఫ్రూట్స్ : జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం, వాల్‌నట్‌లను చాలా మంది ఇళ్లలో రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచడం వల్ల వాటి సహజసిద్ధమైన చక్కెర, రుచిపై ప్రభావం చూపుతుంది. ఫంగస్ ప్రమాదాన్ని కలిగిస్తుంది. అంతే కాదు వాటి సహజ గుణాలు కూడా తగ్గుతాయి.

6 / 7
అన్నం- పండ్లు:  వండిన అన్నాన్ని 24 గంటల కంటే ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే అది విషపూరితంగా మారుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. పుచ్చకాయలు, అరటిపండు కూడా ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు..

7 / 7
కుంకుమపువ్వు: రిఫ్రిజిరేటర్‌లో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది కుంకుమపువ్వును మృదువుగా.. జిగటగా మార్చగలదు. కొన్నిసార్లు కుంకుమపువ్వు కూడా ఎండిపోవచ్చు. ఈ రెండు సందర్భాల్లోనూ కుంకుమపువ్వు సహజమైన రుచి, వాసన, నాణ్యత తగ్గుతుంది.